Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు 500 రూపాయలు పెరిగింది. ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79650 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72800 రూపాయలుగా ఉంది.
బంగారం ధరలు గత రెండు రోజుల్లోనే దాదాపు 3 వేల రూపాయల వరకు తగ్గింది. ఎందుకు ప్రధాన కారణం అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం అని చెప్పవచ్చు. దీంతో స్టాక్ మార్కెట్లకు పెద్ద మొత్తంలో బూస్ట్ లభించింది ఫలితంగా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా స్టాక్ మార్కెట్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం అని చెప్పవచ్చు.
అయితే అనూహ్యంగా బంగారం ధరలు నేడు మళ్ళీ పెరిగాయి ఇందుకు కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు 0.25 శాతం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే, అమెరికా ట్రెజరీ బాండ్లకు రాబడి కూడా తగ్గుతుంది. ఎవరైతే ఇన్వెస్టర్లు అమెరికా ట్రెజరీ బాండ్ల పైన పెట్టుబడి పెట్టారో, వారు తమ పెట్టుబడులను మళ్లీ బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది.
దీనికి తోడు అమెరికా స్టాక్ మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున నష్టాలు నమోదు అయ్యాయి. ఈ కారణంతో బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరగడంతో ఒకసారిగా పసిడి ప్రియులు నిరాశలోకి జారుకుంటున్నారు. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయని అంతా భావించారు కానీ ఒక రోజు గ్యాప్ లోనే మళ్లీ పెరగడంతో ఆందోళన చెందుతున్నారు.
ట్రెండు మళ్ళీ ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర మరోసారి ఆల్ టైం రికార్డులను తాకే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపు అనేది ముందు నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మార్కెట్లో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం వడ్డీరేట్లు తగ్గించడంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు తరలిస్తున్నారు.
దీనికి తోడు చైనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఆసియా మార్కెట్ల వైపు పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా బంగారం మాత్రమే సేఫ్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బంగారంపై ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒక అద్భుతమైన అవకాశం అని నిపుణులు పేర్కొంటున్నారు.