Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులు

Falling Gold Price: బంగారం ధరలు మరోసారి తగుముఖం పట్టడం ప్రారంభించాయి.  పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పతనం అయ్యాయి.  దీంతో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారు.  బంగారం ధర ఎంత తగ్గిందో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం
 

1 /6

Gold Rate Down: బంగారం ధరలు అక్టోబర్ 7 సోమవారం అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,450 రూపాయలు పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,100 రూపాయలు పలికింది. అయితే పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై దాదాపు 200 రూపాయలు తగ్గింది.   

2 /6

ఇక అదే సమయంలో ఆభరణాల కోసం వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను సుమారు 200 రూపాయలు తగ్గింది. బంగారం ధరలు తగ్గడానికి ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరిగాయి. 78 వేల రూపాయల ఎగువన బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి కూడా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.

3 /6

ప్రస్తుతం బంగారం ధర 78 వేల రూపాయల దిగువన ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగారం ధర తగ్గుముఖం పట్టగా. ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. సాధారణంగా ఆభరణాల కోసం వాడే బంగారాన్ని 100 గ్రాములు, 500 గ్రాములు, ఒక కేజీ చొప్పున చూస్తారు. 

4 /6

ఈ విధంగా చూసినట్లయితే 100 గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయలు తగుముఖం కనిపిస్తుండగా...1000 గ్రాముల బంగారం ధరపై మాత్రం దాదాపు 20 వేల రూపాయల తగ్గుముఖం కనిపిస్తోంది. దీంతో నగర తయారీ కోసం బంగారు కొనుగోలు చేసేవారికి ఉపశమనం కలిగింది. బంగారు ఆభరణాలు ఈ రేంజ్ లో మళ్లీ తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహం కూడా చాలామందిలో కలుగుతుంది. 

5 /6

ఇదిలా ఉంటే మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఇంకా కరెక్షన్ బాటలోనే ఉన్నాయి. నేడు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా సెన్సెక్స్ నేడు 638.45 పాయింట్లు నష్టపోయింది. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 3,835 పాయింట్లు నష్టపోయింది.

6 /6

అయితే దీనికి ప్రధాన కారణం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధమే అని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బంగారం ధర తగ్గుదల స్వల్పకాలికం మాత్రమేనని, యుద్ధ వాతావరణం పెరిగే కొద్దీ బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.