Gold Price Today: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. క్షీణించిన వెండి ధర

ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించగా.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొంది.

  • Jan 08, 2021, 08:00 AM IST

Gold Price Today 8th January 2021: ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించగా.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొంది.

1 /4

Gold Price Today 8th January 2021: ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Price Today) క్షీణించగా.. దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొంది. నేటి మార్కెట్‌లో ధరలు ఇలా ఉన్నాయి.

2 /4

Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.510 మేర భారీగా దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51850కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,500 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

3 /4

Gold Price Today In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు ధర దిగొచ్చింది. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.490 మేర తగ్గింది. తాజాగా 10 గ్రాముల ధర రూ.54,160 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.410 తగ్గడంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.49,650కి దిగొచ్చింది.

4 /4

Silver Price Today in Hyderabad: ఢిల్లీలో వెండి ధర తాజాగా రూ.1,700 మేర భారీగా పతనమైంది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.69,700కు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.900 మేర తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.74,200 అయింది.   Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!