Gold : బడ్జెట్ అనంతరం బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.ముఖ్యంగా బంగారం ధరలు గతంలో ఉన్న గరిష్ట స్థాయి కన్నా కూడా దాదాపు 6 వేల రూపాయలు చౌకగా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గడానికి ప్రధాన కారణం దిగుమతి సుంకాలు తగ్గడమే అని చెబుతున్నారు.
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాలను భారీగా తగ్గించడం కూడా ప్రధాన కారణం అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే ట్రెండు కనుక కొనసాగినట్లయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఆదివారం బంగారం ధరలు 24 క్యారట్లకు గానూ 10 గ్రాముల పసిడి 69,100 రూపాయల వద్ద స్థిరపడింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,250 రూపాయల వద్ద స్థిరపడింది. ఒక కేజీ వెండి ధర రూ. 84,000 వద్ద స్థిరపడింది.
ఇదిలా ఉంటే ఆదివారం బంగారం ధరలు 24 క్యారట్లకు గానూ 10 గ్రాముల పసిడి 69,100 రూపాయల వద్ద స్థిరపడింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,250 రూపాయల వద్ద స్థిరపడింది. ఒక కేజీ వెండి ధర రూ. 84,000 వద్ద స్థిరపడింది.
ఈ నేపథ్యంలో బంగారం నగలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్ కావడం ప్రధానంగా మారింది. దీంతో పాటు ఇతర శుభకార్యాలకు కూడా ఇదే ప్రధానమైన సీజన్ గా చెబుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం అనేది ఆభరణాల వ్యాపారులకు ఒక రకంగా బూస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున నగలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గుతాయా లేదా అనే సందేహం కలగవచ్చు.
అయితే దీనిపై నిపుణులు స్పందిస్తూ బంగారం ప్రస్తుతం ఉన్న ధర వద్ద కొంత కాలం స్థిరంగా ఉంటుంది. అందుకే మీ పెట్టుబడిలో కొంత మొత్తం బంగారానికి కేటాయించి నగులు కొనుగోలు చేయడం అనేది తెలివైన నిర్ణయంగా నిపుణులు సూచిస్తున్నారు.