Gold from Mushrooms: మష్రూంల గురించి అందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ నాటు మష్రూంలు అంటే అడవుల్లో లభ్యమయ్యేవాటిలో బంగారం ఉంటుందని దిమ్మ తిరిగే నిజాలు వెలికితీశారు గోవాకు చెందిన పరిశోధకులు. అంటే బంగారపు నానో పార్టికల్స్ తయారు చేయవచ్చంటున్నారు.
బంగారపు నానో కణాలు ప్రపంచ మార్కెట్లో చారా ఖరీదైనవి. 2016 ఫిబ్రవరిలో ఒక మిల్లీగ్రామ్ బంగారపు నానో కణాల ధర 80 డాలర్లు అంటే 80 వేల రూపాయలు.
మష్రూంల నుంచి తయారు చేసిన బంగారంతో గోవా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చవచ్చంటున్నారు. గోవా ప్రాకృతిక సంపదను కొత్తగా ఉపయోగించవచ్చంటున్నారు. బయో మెడికల్, బయో టెక్నాలజికల్ సైన్స్‌లో ఈ బంగారు నానో కణాల్ని ఉపయోగించారు. వీటి ఉపయోగంతో టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ, మెడికల్ ఇమేజింగ్, ఎలక్ట్రానికల్ తయారీలో కీలక మార్పు రావచ్చు.
టేలర్ అండ్ ఫ్రాన్సిస్ ప్రచురించిన జర్నల్ ఆఫ్ జియోమైక్రోబయోలజీలో ఈ పరిశోధన గురించి ప్రస్తావించారు. మూడేళ్లపాటు ఈ రకానికి చెందిన మష్రూంలపై ప్రయోగాలు చేశారు. మష్రూంల నుంచి బంగారపు నానో కణాలు తయారు చేశారు. గోవా ప్రభుత్వానికి కూడా ఈ పరిశోధన వివరాలు అందించారు.
మష్రూంలంటే కొందరికి ఇష్టం. కొందరికి నచ్చదు. ఇదే మష్రూంతో బంగారం చేయవచ్చని గోవా పరిశోధకులు తెలిపారు. అక్కడ లభ్యమయ్యే అటవీ మష్రూంలు ముఖ్యంగా టమిటోమైసెస్ రకానికి చెందిన మష్రూంలు. వీటితో సైంటిస్టులు బంగారపు నానో పార్టికల్స్ తయారు చేశారు. దీమక్ కొండలపై పండించే మష్రూంలను స్థానికులు రోన్ ఓలమీ పేరుతో పిలుస్తారు.
మష్రూం అంటే చాలామందికి ఇష్టమే. కానీ అదే మష్రూంతో బంగారం చేయవచ్చంటే మతి పోతుంది కదూ. గోవా పరిశోథకులు చెబుతున్న నిజమిది. మష్రూం నుంచి గోల్డ్ నానా పార్టికల్స్ తయారుచేయవచ్చంటున్నారు. చెప్పడం కాదు చేసి చూపించారు.