HDFC Bank Credit Card rules: ఆగస్టు నెల 1వ తేదీ నుంచి HDFC క్రెడిట్ కార్డు కస్టమర్లకు భారీ షాక్ తగలనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయినా HDFC బ్యాంక్ తన ఖాతాదారుల కోసం కొన్ని కీలక ప్రకటనలు చేసింది ముఖ్యంగా HDFC బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి.
HDFC Bank Credit Card rules change :ఆగస్టు ఒకటో తేదీ నుంచి క్రెడిట్ కార్డు ఉపయోగించి ఎవరైతే రెంటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతారో, వాటికి సంబంధించిన చార్జీలలో పలు మార్పులు చేసింది. చాలా మంది క్రెడిట్ కార్డు ఉపయోగించి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రెంట్ చెల్లిస్తూ ఉంటారు. ముఖ్యంగా పేటీఎం క్రెడ్, మోబిక్విక్ వంటి మొబైల్ యాప్స్ ఉపయోగించి రెంటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఉంటారు. అయితే ఇలాంటి ట్రాన్సాక్షన్లు జరిపినప్పుడు వీటిపై ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. సవరించిన నిబంధనలలో, థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులతో పాటు, రివార్డ్‌లను రీడీమ్ చేయడం, విద్యాపరమైన లావాదేవీలు వంటి ప్రత్యేక లావాదేవీలపై ఛార్జీలు విధించారు. కొత్త రూల్ ఆగస్ట్ 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది.
అంతేకాదు 50 వేల లోపు చేసే ట్రాన్సాక్షన్లపై ఎలాంటి అదనపు రుసుములు ఉండవని తెలిపింది. కానీ 50 వేల పైన ఉండే ట్రాన్సాక్షన్స్ అన్నింటిపై ఒక శాతం వరకు ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. అయితే ఈ ట్రాన్సాక్షన్ ఫీజు గరిష్టంగా మూడు వేల వరకు ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పై ఈ చార్జీల మినహాయింపును ప్రకటించింది.
ఇక క్రెడిట్ కార్డు ఉపయోగించి పెట్రోల్, డీజిల్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే ఒక ట్రాన్సాక్షన్ లో రూ. 15,000 కనుక దాటితే ఆ మొత్తం ట్రాన్సాక్షన్ పైన ఒక శాతం వరకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రాన్సాక్షన్ అనేది గరిష్టంగా మూడు వేల వరకు విధించారు.
అలాగే క్రెడిట్ కార్డు ఉపయోగించి ఎడ్యుకేషనల్ ట్రాన్సాక్షన్స్ జరిపితే కూడా ఒక శాతం వరకు ఫీజు వసూలు చేయనున్నారు. అయితే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పేమెంట్లకు మాత్రం కాస్త మినహాయింపు ఇచ్చారు. అయితే POS మెషీన్ల ద్వారా స్కూలు కాలేజీ ఫీజులు చెల్లించినట్లయితే ఈ ట్రాన్సాక్షన్ పై మినహాయింపు ఉంటుంది.
థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపితే మాత్రం చార్జీలు వసూలు చేయనున్నారు. ఇంటర్నేషనల్ కరెన్సీ చార్జీలపై కూడా 3.5% వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరిన్ని వివరాల కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.