Fruits For Thick Hair: జుట్టు ఆరోగ్యంగా.. అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే, మారుతున్న జీవనశైలి, బిజీ లైఫ్‌స్టైల్ వల్ల హెయిర్ కేర్ తీసుకోకపోవడంతో జుట్టు ఎదుగుదల కుంటుపడుతుంది. కొన్ని రకాల ఆహారాలు డైట్లో చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
ప్రకృతి అందించే పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా అవకాడో, అరటిపండు, పైనాపిల్, యాపిల్స్, కీవీ వంటి పండ్లలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, అందంగా మందంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
బెర్రీ పండ్లు.. రాస్బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీ జాతి పండ్లు మన డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఎదుగుదలకు ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా ఇవి తలపై కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా బలంగా మారుతుంది.
అవకాడో.. అవకాడోలో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, సీ, బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన స్కాల్ప్, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
విటమిన్ సీ.. విటమిన్ సీ పుష్కలంగా ఉండే పండ్లు ముఖ్యంగా ఆరెంజ్ నిమ్మకాయ, గ్రేప్స్‌లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. హెయిర్ ఫోలికల్స్‌ను బలంగా మారుస్తుంది.
అరటిపండు.. అరటిపండు కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. ఎందుకంటే ఇందులో నేచురల్ ఆయిల్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కార్బొహైడ్రేట్స్, విటమిన్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తాయి.
పైనాపిల్.. పైనాపిల్ కూడా జుట్టు మందంగా పెరగడానికి సహాయపడతాయి. పైనాపిల్‌లో కూడా విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో బ్రోబలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ కాకుండా ,జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది.
యాపిల్.. యాపిల్‌లో కూడా జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా యాపిల్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. అంతేకాదు ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
కీవీ.. కీవీ కూడా విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సీ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన కుదుళ్ల నిర్వహణకు కూడా ప్రేరేపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)