Idly Recipe: చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ తినేందుకు ఇష్టపడతారు. అయితే ఇడ్లీలు మెత్తగా, తెల్లగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇడ్లీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే..మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి. ఎలాగో చూద్దాం.
Fluffy Idly Recipe: చాలా మంది బయట ఫుడ్ తినాల్సి వస్తే ఇడ్లీనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఇడ్లీలో ఆయిల్ తక్కువగా ఉంటుంది. ఆవిరి మీద చేసే ఫుడ్ కాబట్టి సులభంగా జీర్ణం అవుతుంది. అయితే హోటల్స్ చేసే ఇడ్లీలు మెత్తగా, తెల్లగా, రుచిగా ఉంటాయి. ఇలా మనం చేస్తే ఎందుకు రావు అనే సందేహం కలగడం సాధారణమే. హోటల్లో తయారు చేసే ఇడ్లీ రుచి మనమూ ఇంట్లోనే సులభంగా రెడీ చేసుకోవచ్చు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందామా?
రవ్వ: ఇడ్లీ రుచికరంగా ఉండాలంటే మంచి క్వాలిటీ గల రవ్వను కొనుగోలు చేయాలి. ఎందుకంటే రవ్వ బాగుంటే ఇడ్లీలు రుచికరంగా ఉంటాయి.
రవ్వ నానబెట్టడం:ఇడ్లీ తయారు చేయడానికి ముందు రవ్వ, మినపప్పును ఉదయం నానబెట్టాలి. రెండింటిని విడివిడిగా నానబెట్టాలి.
గ్రైండ్ చేయడం:రవ్వ, మినప పప్పు 5 గంటలు నానిన తర్వాత పప్పును గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ రవ్వలో కలపాలి. మరీ పల్చగా, గట్టిగా కాకుండా మీడియం ఉండాలి. చాలా మంది ఇందులో ఉప్పు వేస్తారు. ఉప్పువేస్తే తెల్లారేసరికి పుల్లగా అవుతుంది. కాబట్టి ముందే ఉప్పు వేయకూడదు.
ఐస్ వాటర్:మినప పప్పు గ్రైండ్ చేసుకొనేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా ఫ్రిజ్ లో పెట్టిన చల్లని వాటర్ కలుపుకున్నట్లయితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. రవ్వను నానబెట్టే ముందు రెండు సార్లు కడిగి నీటిని పారబోయాలి. ఇలా చేస్తే తెల్లగా వస్తాయి.
ఆవిరి:ఇడ్లీ మౌల్ట్ లలో ఇడ్లీ పెట్టి నార్మల్ మంట మీద పెట్టాలి. ఇలా నార్మల్ మంట మీద పెడితే ఇడ్లీలు చక్కగా వస్తాయి. మొదట్లో పొరపాటు జరగవచ్చు. ఇడ్లీలు సరిగ్గా రాకపోవచ్చు. అలాని నిరాశ చెందకండి. మళ్లీ ప్రయత్నించండి. అప్పుడు మీరు హోటల్ స్టైల్లో మెత్తగా, రుచిగా తయారు చేసుకోవచ్చు.