Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో బీజేపీ ఎమ్మెల్యే.. శ్రేయాసీ సింగ్ గురించి ఈ విషయాలు తెలుసా..?

Paris Olympics:  పారిస్ లో ఒలింపిక్ వేడుకలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మన భారత్  నుంచి మొత్తం 117 మంది భారత క్రీడాకారులు వివిధ క్రీడాంశాలలో..ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లారు. వీరిలో బీజేపీ మహిళ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. 
 

1 /6

బీహర్ కు చెందిన దివంగత నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె ఈ శ్రేయాసీ సింగ్. 2020 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జముయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే విధంగా.. శ్రేయాసీ సింగ్ ఫరీదాబాద్‌లోని మానవ్‌రచనా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు.

2 /6

శ్రేయాసీ సింగ్ కుటుంబం మొత్తం రాజకీయాలకు నేపథ్యమున్న కుటుంబం. శ్రేయాసీ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జముయ్ నియోజకవర్గంలో షాట్‌గన్ రేంజ్ అందుబాటులో లేకపోవడంతో.. ఆమె ఢిల్లీకి వెళ్లి మరీ కష్టపడి ప్రాక్టిస్ చేశారు.

3 /6

ఒలింపిక్స్‌లో   ఆడి  విజయం సాధించాలనేదే తన తండ్రి దిగ్విజయ్ సింగ్ కోరిక అని కూడా శ్రేయసీ చెప్తుండేది. ఒలింపిక్స్‌లో దేశానికి షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి మన దేశం గర్వపడేలా చేస్తానని చెప్పుకొచ్చింది.  ఈ నెల 30, 31 వ తేదీల్లో.. షూటింగ్ పోటీలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో..  దేశానికి పతకం సాధించాలని జముయ్ నియోజకవర్గంతోపాటు బీహార్ ప్రజలు కోరుకుంటున్నారు.

4 /6

షూటీంగ్ లో శ్రేయసీ సింగ్  ఇప్పటికే అనేక పతకాలను సాధించారు. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ విభాగంలో శ్రేయాసీ సింగ్ రజత పతకం సాధించారు. అదే విధంగా.. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో స్వర్ణ పతకాన్ని ఆమె అందుకుంది. ఈ క్రమంలోనే షూటింగ్ ఆటలో శ్రేయాసీ సింగ్ సాధించిన పతకాలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం.. ఆమెకు అర్జున అవార్డును ప్రకటించింది.

5 /6

ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం చేజిక్కించుకోవాలనే టార్గెట్ తో శ్రేయసీ పారిస్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శ్రేయసీ..తొలిసారి ఒలింపిక్స్ గేమ్స్‌కు ఎంపిక కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మన దేశం నుంచి పారిస్ కు వెళ్లిన  భారత షూటర్ 22  మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు అర్హత సాధించింది.  

6 /6

ఒక ఎమ్మెల్యే గా ఉండి కూడా, ఒలింపిక్స్ లో వెళ్లడం, అదే విధంగా శ్రేయసీ ఎలాగైన స్వర్ణం గెలవాలని కూడా చాలా మంది భారతీయులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో పారా ఒలింపిక్స్ లో ఈసారి భారత్ కు పతకాలు వస్తాయని కూడా చాలా మంది  భావిస్తున్నారు.