Flipkart TV Days: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం కన్నా తక్కువ ధరకే 5 స్మార్ట్ టీవీలు

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 'టీవీ డేస్' ఆఫర్ నడుస్తోంది.  ఈ నెల 19తో ఈ ఆఫర్ ముగియనుంది. ఆఫర్‌లో భాగంగా బెస్ట్ బ్రాండ్స్ స్మార్ట్ టీవీలను చౌక ధరలో పొందవచ్చు. కొన్ని బ్రాండ్స్‌పై సగం వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

  • Apr 17, 2022, 13:23 PM IST

Flipkart TV Days Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 'టీవీ డేస్' ఆఫర్ నడుస్తోంది.  ఈ నెల 19తో ఈ ఆఫర్ ముగియనుంది. ఆఫర్‌లో భాగంగా బెస్ట్ బ్రాండ్స్ స్మార్ట్ టీవీలను చౌక ధరలో పొందవచ్చు. కొన్ని బ్రాండ్స్‌పై సగం వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

1 /5

43-అంగుళాల 4K డిస్‌ప్లేతో కూడిన ఈ BLAUPUNKT స్మార్ట్ టీవీ ధర రూ. 41,999 కాగా... రూ.26,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు దీనిపై రూ. 1,250 ఆదా చేసుకోవచ్చు. అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ ద్వారా రూ. 18,000 తగ్గింపు పొందవచ్చు. మొత్తం మీద ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ టీవీని రూ.7,749కే కొనుగోలు చేయవచ్చు.

2 /5

మోటరోలా కంపెనీకి చెందిన ఈ రూ.47,999 రూపాయల ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.32,999కి అందుబాటులో ఉంది. ఇది 43-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా దీనిపై రూ. 1,650 ఆదా చేయవచ్చు. అలాగే, మీ పాత స్మార్ట్ టీవీకి బదులుగా ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం ద్వారా మరో రూ.18 వేలు ఆదా చేసుకోవచ్చు. మొత్తంగా ఆఫర్ కింద ఈ టీవీని రూ. 13,349కే పొందవచ్చు.  

3 /5

రూ.45,000 ధర కలిగిన ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.28,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ ఆఫర్ ద్వారా భారీ తగ్గింపుకు దీన్ని కొనుగోలు చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1,450 ఆదా చేయడంతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ. 21,400 తగ్గింపును పొందవచ్చు. డిస్కౌంట్స్ పోను రూ. 6,149తో ఈ టీవీని మీరు కొనుగోలు చేయొచ్చు.

4 /5

43-అంగుళాల 4K డిస్‌ప్లేతో కూడిన Mi ఈ స్మార్ట్ టీవీ మార్కెట్లో రూ. 34,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్ ద్వారా దీన్ని రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై మరో రూ.1700 ఆదా చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ. 21,400 వరకు ఆదా చేయొచ్చు. మొత్తంగా డిస్కౌంట్‌పై ఈ టీవీని రూ.7,099కే కొనుగోలు చేయవచ్చు.

5 /5

ఈ 43-అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీలో మీరు అల్ట్రా HD 4K LED డిస్‌ప్లే పొందుతారు. దీని అసలు ధర రూ. 52,900. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ. 33,990కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా మరో రూ. 1,700 ఆదా చేసుకోవచ్చు. అలాగే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ కింద మరో రూ. 18,000 ఆదా చేసుకోవచ్చు. మొత్తంగా డిస్కౌంట్‌పై ఈ టీవీని కేవలం రూ.14,290కే కొనుగోలు చేయవచ్చు.