Flipkart Dhamaka Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మినీ గాడ్జెట్స్ ధర ఎంతో తెలుసా

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బడ్జెట్ థమాకా సేల్ ఇవాళ చివరితేదీ. ఈ సేల్‌లో మీకు అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్‌లో మీకు విభిన్నమైన పోర్టబుల్ గాడ్జెట్స్ లభిస్తాయి. ఇవి చాలా ఉపయోగకరం కూడా. ఆ పోర్టబుల్ గాడ్జెట్స్ ఏంటి..ధర ఎంతనేది తెలుసుకుందాం..

Flipkart Dhamaka Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బడ్జెట్ థమాకా సేల్ ఇవాళ చివరితేదీ. ఈ సేల్‌లో మీకు అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్‌లో మీకు విభిన్నమైన పోర్టబుల్ గాడ్జెట్స్ లభిస్తాయి. ఇవి చాలా ఉపయోగకరం కూడా. ఆ పోర్టబుల్ గాడ్జెట్స్ ఏంటి..ధర ఎంతనేది తెలుసుకుందాం..

1 /5

గుగ్లీ టెక్ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ 15 నిమిషాల్లో బట్టలు శుభ్రం చేసే పోర్టబుల్ వాషింగ్ మెషీన్..అసలు ధర 7 వేల 999 రూపాయలు కాగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 4 వేల 499 రూపాయలకు లభిస్తుంది. 

2 /5

నెక్‌బ్యాండ్ ఫ్యాన్ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్‌లాగే నెక్‌బ్యాండ్ ఫ్యాన్ ఇది. 2 వేల 5 వందలున్న ఈ నెక్‌బ్యాండ్ ఫ్యాన్ కేవలం 519 రూపాయలకే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా మరో 5 శాతం  డిస్కౌంట్ లభిస్తుంది. 

3 /5

మై కిచెన్ పోర్టబుల్ మినీ ఫ్రిడ్జ్ 6 లీటర్ల సామర్ధ్యం కలిగి మినీ పోర్టబుల్ ఫ్రిడ్జ్ ఇది. 31 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. 22 వేలకు బదులు..15 వేలకే కొనుగోలు చేయవచ్చు.

4 /5

బ్లూ స్టార్ పోర్టబుల్ ఏసీ 39 వేలున్న ఈ పోర్టబుల్ ఏసీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో  13 శాతం డిస్కౌంట్ అనంతరం 33 వేల 9 వందలకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా మరో 1695 రూపాయలు తగ్గుతుంది. అంటే 32 వేల 205 రూపాయలకు అందుతుంది.

5 /5

క్రాంప్టన్ పోర్టబుల్ ఎయిర్ కూలర్ 10 లీటర్ల కెపాసిటీ కలిగి ఉన్న పోర్టబుల్ కూలర్ ఫ్లిప్‌కార్ట్‌లో 3 వేల 950 రూపాయలకే లభిస్తుంది. అసలు ధర 4 వేల 9 వందలుంది.