Eclipse 2024: నెలవ్యవధిలోనే సూర్య-చంద్రగ్రహణాలు.. ఈ ఒక్క రాశికి మెగా బంపర్ ఆఫర్..

Ecllipse 2024 effect on Zodiac sign: సూర్య చంద్రగ్రహణాలు రాశిచక్రాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది.

1 /5

సూర్య చంద్రగ్రహణాలు రాశిచక్రాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ ఏడాది మార్చి 25 మొదటి చంద్రగ్రహణం రానుంది. 15 రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 8న  ఈ సంవత్సరపు మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.  

2 /5

మేషరాశి.. రెండూ సూర్యచంద్రగ్రహణాల ప్రభావం కారణంగా మేషరాశివారి విధి పూర్తిగా మారిపోనుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ రాశికి బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇది శుభసమయం. కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెట్టొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

3 /5

సింహరాశి.. ఈ ఏడాది రానున్న మొదటి సూర్యచంద్రగ్రహణాల ప్రభావం కారణంగా సింహ రాశివారికి మంచి సమయం రానుంది. విదేశాలకు వెళ్లే యోగం ఉంది. ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వ్యాపారం విస్తరణ జరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది శుభసమయం. 

4 /5

మిథునరాశి.. రెండు గ్రహణాలు మిథునరాశిపై శుభఫలితాలను ఇస్తుంది. వీరి అదృష్టం పూర్తిగా మారిపోతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ ఏడాది మొదటి సూర్యచంద్రగ్రహణాల వల్ల మిథునరాశివారికి వ్యాపారంలో బాగా కలిసివస్తుంది.

5 /5

వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక చిక్కులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)