Fatty Liver Problem: ఫ్యాటీ లివర్ అంత ప్రమాదకరమా, ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి

ఆధునిక జీవన విధానంలో, ఉరుకులు పరుగుల జీవితంలో చెడు ఆహారపు అలవాట్ల ప్రభావం ఆరోగ్యంపై, మరీ ముఖ్యంగా లివర్‌పై పడుతుంటుంది. ఇటీవలి కాలంలో అందుకే ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. మద్యపానం ముట్టనివారిలో కూడా ఈ వ్యాధి కన్పిస్తోంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడమే ఫ్యాటీ లివర్ సమస్య. ప్యాటీ లివర్ సమస్య ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంతే ప్రమాదకరమైంది.

Fatty Liver Problem: ఆధునిక జీవన విధానంలో, ఉరుకులు పరుగుల జీవితంలో చెడు ఆహారపు అలవాట్ల ప్రభావం ఆరోగ్యంపై, మరీ ముఖ్యంగా లివర్‌పై పడుతుంటుంది. ఇటీవలి కాలంలో అందుకే ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా కన్పిస్తోంది. మద్యపానం ముట్టనివారిలో కూడా ఈ వ్యాధి కన్పిస్తోంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడమే ఫ్యాటీ లివర్ సమస్య. ప్యాటీ లివర్ సమస్య ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంతే ప్రమాదకరమైంది.

1 /5

ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి, ప్రతి పది మంది చిన్నారుల్లో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందంటే మీరు నమ్ముతారా...

2 /5

ఫ్యాటీ లివర్ ఉందని అనుమానంగా ఉన్నా లేక ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏమైనా కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

3 /5

ఫ్యాటీ లివర్ సమస్య నుంచి కాపాడుకోవాలన్నా, చికిత్స అందించాలన్నా ప్రధానంగా చేయాల్సింది హెల్తీ లైఫ్‌స్టైల్ అలవర్చుకోవడం. ఇందులో బ్యాలెన్స్ డైట్, నిర్ణీత పద్ధతిలో వ్యాయామం, బరువు తగ్గించుకోవడం, మద్యపానానికి దూరంగా ఉండటం చేయాలి

4 /5

ఫ్యాటీ లివర్ సమస్యకు చికిత్స చేయించకపోతే అది క్రమంగా విషమంగా మారుతుంది. ఇందులో లివర్ ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటి వ్యాధుల ముప్పు ఉంటుంది. 

5 /5

ఇదొక ప్రమాదకరమైన వ్యాధికి కారణమౌతుంది. ఫ్యాటీ లివర్ ప్రారంభదశలో ఏ లక్షణాలు పెద్దగా కన్పించవు. అలసట లేదా కడుపుపై కుడివైపు తేలికపాటి నొప్పి ఉంటుంది. సాధారణంగా ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకుంటుంటాం.