KCR Tears: అక్కను చూసి మాజీ సీఎం కేసీఆర్ కన్నీళ్లు.. విషాదంలో కల్వకుంట్ల కుటుంబం

Former CM KCR Gets Tears After Tributes Of His Sister Cheeti Sakalamma: తన సోదరిమణి కన్నుమూయడంతో మాజీ సీఎం కేసీఆర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తన అక్కను చూసి కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. చీటి సకలమ్మ మృతితో కల్వకుంట్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

1 /8

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తన సోదరిమణి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు. 

2 /8

కేసీఆర్ ఐదో సోదరి చీటీ సకలమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త విన్న కేసీఆర్‌ వెంటనే శనివారం ఉదయం ఆమె ఇంటికి వెళ్లారు.

3 /8

తన అక్క సకలమ్మతో ఆత్మీయ అనుబంధం కలిగిన కేసీఆర్‌ ఆమె మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. కేసీఆర్‌ తన అక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

4 /8

హైదరాబాద్‌లో సకలమ్మ పార్థీవదేహానికి కేసీఆర్‌ పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం సకలమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. 

5 /8

ప్రతి రాఖీ పండుగకు తప్పనిసరిగా కేసీఆర్‌ తన అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుంటున్నారు. కేసీఆర్‌తో అక్కాచెల్లెళ్ల అనుబంధం విడదీయరానిది.

6 /8

సకలమ్మ అంత్యక్రియలలో కూడా కేసీఆర్‌ తన సతీమణి శోభతోపాటు కుమారుడు కేటీఆర్‌, కోడలు శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, మేనల్లుడు హరీశ్‌ రావు తదితరులు హాజరయ్యారు.

7 /8

కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ప్రస్తుతం ముగ్గురు అక్కలు మృతి చెందారు.

8 /8

2018లో కేసీఆర్‌ ఇద్దరు అక్కలు విమల బాయి (82), లీలమ్మ కన్నుమూయగా.. తాజాగా సకలమ్మ మరణించారు.