Sravana Masam: శ్రావణమాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకత ఉంటుంది. రోజుకో పూజతో మహిళలందరూ బిజీగా గడుపుతారు. మరీ పూజలతో పాటు వాళ్ల ధరించే దుస్తువులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. దేవాలయానికి వెళ్లడం, స్నేహితులు, బంధువుల ఇంట్లో పూజకు వెళ్లుతుంటారు. మరి శ్రావణంలో మీరు కూడా స్పెషల్ గా కనిపించాలంటే సింపుల్ చీరకు స్టైలిష్ ప్రింటెడ్ బ్లౌజ్ ను ధరిస్తే చీరకు కొత్త రూపాన్ని ఇస్తుంది.అలాంటి డిజైన్లను చూద్దామా?
ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. ఈ నెల అంతా కూడా పూజలు, వ్రతాలతో మహిళలు బిజీబిజీగా గడుపుతారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా గడుపుతారు. శ్రావణమాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈ రోజు మహిళలు వరలక్ష్మీ అమ్మవారి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అయితే శ్రావణమాసం అంతా కూడా ప్రత్యేకమే కాబట్టి ప్రతిరోజూ ప్రత్యేకంగా కనిపించాలంటే కొన్ని ఫ్యాషన్ టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో ముఖ్యంగా మహిళలు చీరలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు రకరకాల చీరలు ధరిస్తుంటారు. కాటన్ చీర కడితే వచ్చే సొగసు, గ్లామర్ మరే చీరలోనూ ఉండదుప్లెయిన్ కాటన్ చీరకు డిజైనర్ ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. అలాంటి కొన్ని ఐడియాస్ మీకోసం.
ప్రింటెడ్ బ్లౌజ్ ల కోసం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ప్లేయిన్ చీరకు స్టైలిష్, ట్రెండీ లుక్ పొందాలనుకుంటే..అజ్రాక్ ప్రింట్ బ్లౌజ్ ను ధరించండి. ఈ ప్రింట్ చాలా రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పూర్తిగా గుజరాతీ లుక్ తో ఉంటుంది. ఈ కాంబినేషన్ బ్యూటీఫుల్ ఎత్నిక్ లుక్ ను ఇస్తుంది. వైట్, బ్లూ, గ్రీ లేదా రెడ్ చీరకు ఇలాంటి బ్లౌజ్ ట్రై చేయండి.
మధుబని ప్రింట్ బ్లౌజ్ : మధుబని ప్రిట్ స్పెషల్ ఏంటంటే..ఇది విలేజ్ కల్చర్,ప్రకృతి, పురాణాలను తెలిపే ప్రింట్. మార్కెట్లో మధుబని చీరలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ కాస్త ఖరీదు ఎక్కువ. కాబట్టి చీర కాకుండా బ్లౌజ్ ను డిజైన్ చేయించుకుంటే డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఈ శ్రావణంలో మీరూ ట్రై చేయండి.
కలంకారి ప్రింట్ : కలంకారి ప్రింట్ బ్లౌజ్ మరో బెస్ట్ ఆప్షన్. నార్మల్ కాటన్ చీరకు డిజైనర్ రూపాన్ని ఇస్తుంది. ఈ ప్రింట్ స్పెషాలిటి ఏంటంటే.. అద్భుతమైన కళాత్మకత,రంగుల కలయిక. కలంకారి ప్రింట్‌లలో దేవుళ్ళు, జంతువులు, పక్షులు, చెట్లు వంటి చిత్రాలు ఉంటాయి. ఇది మీకు స్టైలిష్, ఫ్యూజన్ రూపాన్ని ఇస్తుంది.
బాగ్ ప్రింట్ బ్లౌజ్: బాగ్ ప్రింట్ కలర్స్, డిజైన్స్ చూడగానే ఆకట్టుకుంటాయి.మీ చీరను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ ప్రింట్ కాటన్ చీరలపై చాలా బాగుంటుంది. మీరు గ్రీన్, రెడ్, ఎల్లో వంటి రంగుల చీరలతో గార్డెన్ ప్రింట్ బ్లౌజ్‌ని ధరించవచ్చు.
పోల్కా డాట్స్ ప్రింట్ బ్లౌజ్: మీకు క్లాసిక్, రెట్రో,స్టైలిష్ ఏదైనా కావాలంటే, పోల్కా డాట్స్ ప్రింట్ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్. ఈ డిజైన్ ప్రత్యేకత ఏమిటంటే ఈ డిజైన్ ఎప్పుడూ ఫ్యాషన్‌లో ఉంటుంది. మీరు ఏ రంగు చీరతోనైనా పోల్కా డాట్స్ ప్రింట్ బ్లౌజ్ ధరించవచ్చు. ఈ లుక్ మిమ్మల్ని స్టైలిష్ గా మార్చడమే కాకుండా రెట్రో టచ్ కూడా ఇస్తుంది. ఈ రకమైన బ్లౌజ్ ధరిస్తే.. సాధారణ చీరకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వవచ్చు.
ఈ ట్రెండీ, స్టైలిష్ ప్రింటెడ్ బ్లౌజ్ డిజైన్‌లతో, ప్లెయిన్ చీరను కూడా ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. వచ్చే శ్రావణమాసంలో ప్రత్యేకంగా కనిపించాలంటే వీటిని ట్రై చేయండి. ఈ బ్లౌజ్ డిజైన్‌లను అనుసరిస్తే...మీరు ఎప్పుడూ ఫ్యాషన్‌గా కనిపిస్తారు.