Secunderabad Mahankali Bonalu: సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు.. వాహనదారులకు ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు ఇవే..

Secunderabad Mahankali Bonalu: బోనాల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపే సికింద్రాబాద్‌ మహంకాళీ బోనాలు సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ముందుగానే ఈ రూట్లలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి..
 

1 /6

తెలంగాణ ట్రాఫిక్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ట్రాఫిక్‌ మళ్లింపులకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. సికింద్రాబాద్‌ మహంకాళీ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వారి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయాలను కూడా కల్పించారు. ఈ సందర్భంగా ఆ రూట్లలో వెళ్లే వాహనాలకు బోనాల సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు. జూలై 22 వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.  

2 /6

ఈ మార్గాలలో సాధారణ వాహనదారులు వెళ్లకుండా కర్బల మైదాన్‌ జంక్షన్‌ వద్ద మళ్లింపులు చేపట్టారు. రాణిగంజ్‌, ఓల్డ్‌ రాంగోపాల్‌పేట, ప్యారడైజ్‌, ప్లాజా, ఎస్‌బీఐరోడ్డు, వైఎంసీఏ, సెయింట జాన్స్‌ రోటరీ, సంగీత్‌, ప్యాట్నీ, పార్క్‌లేన్‌, బాటా, ఘాన్సీమండీ, బైబిల్‌ హౌజ్‌, మినిస్టర్‌ రోడ్డు, రసూల్‌పురా మార్గాలలో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు.  

3 /6

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలనుకునేవారు సాధారణ సమయం కంటే మరింత ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ఎందుకంటే ఈ రూట్లలోనే ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు. మహంకాళి టెంపుల్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ ఏర్పడుతుంది.   

4 /6

మహంకాళీ ఆలయానికి వెళ్లే రూట్‌ అయిన టొబాకో బజార్, ఆదయ్య రోడ, జనరల్‌ బజార్‌ రోడ్లన్ని మూసివేయనున్నారు.అంతేకాదు బాటా క్రాస్‌ రోడ్లు సుభాష్‌ రోడ్డు, ఓల్డ్‌ రాంగోపాల్‌ పేట రూట్లు కూడా మూసివేయనున్నారు. ఈ మార్గాల్లో మహంకాళీ ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్‌ కోసం మార్గాలు మూసివేశార. అయితే, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 901020362 ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లకు వెంటనే కాల్‌ చేయండి.  

5 /6

ఒక బైబిల్ హౌస్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ చేరుకునే వాహన చోదకులు తిరుమలగిరి నుంచి డైవర్షన్ ఇచ్చారు. అక్కడ ఝాన్సీమండీ క్రాస్ రోడ్ నుంచి సజ్జనల్ స్ట్రీట్, ఆర్ హిల్ స్ట్రీట్ మీదుగా వెళ్లాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. క్లాక్ టవర్ సంగీత్, సికింద్రాబాద్ స్టేషన్ చిలకలగూడ ముషీరాబాద్ క్రాస్ రోడ్ కవాడిగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.  

6 /6

అయితే ప్యారడైజ్ నుంచి బైబిల్ హౌస్ మీదుగా వెళ్లేవారు ఫ్యాట్నీ క్రాస్ రోడ్ లో ఉన్న ఎస్బిఐ క్లాక్ టవర్ వైపుగా వెళ్లాలి అయితే క్లాక్ టవర్ నుంచి ఆర్పి రోడ్డుకు వెళ్లాలి. ముఖ్యంగా సిటీవో జంక్షన్లో ఎంజీ రోడ్డు  ప్యాట్నీ ప్యారడైస్ క్రాస్ రోడ్ నుంచి సింధు కాలనీ, మినిస్టర్ రోడ్, రాణిగంజ్ కర్బల మైదానం దిశగా వెళ్లాలి