Guru Vakri Lucky Zodiac Signs: అక్టోబర్ 10 తేదీ నుంచి ఫిబ్రవరీ 4వ తేదీ వరకు ఈ రాశులకు అదృష్టం మామూలుది కాదు. 117 రోజులపాటు కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు వక్రగతిలోకి మారతాడు. దీనివల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో అనే అయోమయంలో ఉంటారు.
ఇక శనిదేవుని వక్రగతి నవంబర్ 10వ తేదీ నుంచి పూర్తవుతుంది. అయితే, రాశుల జీవితంపై కేవలం ఒక్క గ్రహం ప్రభావం వల్ల ఫలితాలు రావు. కొన్ని గ్రహాలు కొన్ని మంచి ఫలితాలను ఇస్తే మరికొన్ని దుష్ఫలితాలను అందిస్తాయి. గురుడు వక్రగతిలో ఉన్న మిగతా గ్రహాల శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి రాశులవారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. గురువక్రి వల్ల లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం
మేషరాశిలో గురుడు రెండో స్థానంలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు శుభ స్థానంలో ఉన్నాడు. వక్రగతి వల్ల మేష రాశివారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ, ప్రణాళికాబద్ధమైన పనులు చేయరు. బద్ధకం తగ్గించుకుంటే బాగుంటుంది.
వృషభ రాశి.. వృషభ రాశివారికి గురుడు శత్రువు కాదు. గురువు వక్రి ఈ రాశులవారికి మిశ్రమ ఫలితాలు కలిగిస్తాడు. స్థల మార్పు ఉంటుంది. ధనవ్యయం జరిగే అవకాశం ఉంది.
మిథునం.. మిథున రాశివారికి రాజయోగం వంటిది. 117 రోజులపాటు బాగా కలిసి వస్తుంది. మిథున రాశివారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈరోజుల్లో మంత్ర తంత్ర పూజా ఫలితాలు అందుతాయి.
కర్కాటకం.. గురుడు వక్రగతి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపార మార్పులు వస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విదేశాల నుంచి స్వదేశాలకు వస్తారు.
సింహ రాశి.. సింహ రాశి వారికి అదృష్టం రాజయోగం. దశమంలో గురుడు ఉన్నాడు. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. కానీ, ఈ రోజుల్లో కొత్త ఇళ్లు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కీలకపదవులను అధిరోహిస్తారు. కష్టాలకు ఫలితం లభిస్తుంది.
కన్యా రాశి.. కన్యా రాశి ఈ గురు వక్ర గతి ఇబ్బందులు పెడుతుంది. సప్తమంలో రాహువు వక్రి కూడా ఈ రాశిలో జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ సన్నిహితులే వెన్నుపోటు పొడుస్తారు. కుటుంబ, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు. ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
తులా రాశి.. గురుడు వక్రగతి విశేష యోగాలను కలుగజేస్తుంది. ఈ గురువు అష్టమ స్థానంలో వక్రించాడు. దీంతో వీరికి విపరీత యోగాలు కలుగుతాయి. సంతానం, భాగస్వామి నుంచి మంచి జరుగుతుంది. ఉన్నత పదవులు, విదేశీయానం చేస్తారు. రుణ బాధలు కూడా తగ్గిపోతాయి.
వృశ్చిక.. ఈ రాశికి వ్యతిరేక ఫలితాలు లభిస్తాయి. సప్తమంలో గురుడు వక్రికరించాడు, చతుర్థ స్థానంలో శని వక్రి ఉంది కాబట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడుకునేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈ సమయంలో అప్పులు తీసుకోకూడదు.
ధనస్సు.. ఈ గురుడు వక్ర గతి విశేష ఫలితాలు లభిస్తాయి. నూతన ఉత్సాహాం, ధనం సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధి జరుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.
మకర రాశి.. ఈ రాశికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో స్వంత నిర్ణయాలు తీసుకోకూడదు. మీ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు. నీలాపనిందలు వస్తే భయపడకూడదు. మీ పని మీరు చేసుకోండి. విమర్శలు, ప్రతి విమర్శలు చేయకూడదు.
కుంభ రాశి.. 2024 మేలో గురు బలం పెరుగుతుంది. ఈ రాశివారికి ఉద్యోగ మార్పుకు అవకాశం ఉంది. పెద్దగా ఇబ్బందులు ఏం ఎదురు కావు. భూ విక్రయాలు త్వరగా జరుగుతాయి.
మీన రాశి.. మీన రాశివారికి అదృష్ట కాలం. ప్రత్యేకించి ఈ గ్రహ స్థితి పెను మార్పులకు కారణమవుతుంది. ఇటువంటి తరుణంలో గురుడు మీపై విశేష కరుణ కలుగుతుంది. జీవితభాగస్వామి సమస్యలు తగ్గిపోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)