Friday Remedies: కొందరు శుక్రవారంను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే శుక్రవారం రోజున ఎంతో పవిత్రంగా ఉంటారు. ఈరోజున ఈ పనులు అస్సలు చేయోద్దని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.
విష్ణువు సతీమణికి శుక్రవారం అనేది ఎంతో ఇష్టమని చెబుతుంటారు. అందుకే శుక్రవారం రోజున ఈ పనులు ఎంతో పవిత్రంగాను, జాగ్రత్తగాను ఉండాలి. శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. స్నానాదులు పూర్తి చేసుకుని ఇంటి ముందర కల్లాపి చల్లి శుభ్రంగా ఉంచుకోవాలి.
శుక్రవారం రోజున ఇంట్లో అనవసరంగా వాదులాటను అస్సలు చేసుకోకూడదు. గొడవలు పడే విషయాలకు దూరంగా ఉండాలి. అందరితోను సౌమ్యంగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరితో ఎంతో గౌరవంగాను మెలగాలి. ఈరోజున కటింగ్ కు వెళ్లడం, గోర్లు తీసుకొవడం వంటి పనులను చేయకూడదు.
అదే విధంగా శుక్రవారం రోజున ఇంట్లోని డబ్బులు, ఉప్పును ఎవరికి దానంగా అస్సలు ఇవ్వకూడదు. ఇలా చేస్తే జాతకంలో అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఈరోజున ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి.
ముఖ్యంగా కిచెన్ లోని బెల్లం, ఉప్పు అనే పదార్థాలు అయిపోకుండా చూసుకోవాలి. అదే విధంగా వీటిని శుక్రవారం రోజున ఇంటికి తీసుకురావాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి కొదువ ఉండదు. అఖండ ధనయోగం ఉంటుంది. శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలును మాటలతో మనస్సు నొప్పించకూడదు.
శుక్రవారం రోజున ఇంటొ కోడలిని మరో ఊరికి గానీ లేదా మరో చోటకి కానీ అస్సలు పంపకూడదు. ఆమె మన ఇంటి లక్ష్మీస్వరూపం. అందుకే ఇల్లాలీని ఎప్పుడు కూడా కంట నీరులేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. శుక్రవారం రోజున ఎవరైతే అష్టలక్ష్మీ వ్రతం ఆచరిస్తారో వారింట ఎప్పుడు ధనధాన్యాలకు, సుఖ సంపదలు అస్సలు లోటుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)