Men's Vs Women's Cricket: మహిళల క్రికెట్‌కి, పురుషుల క్రికెట్‌కి మధ్య తేడాలు గురించి మీకు తెలుసా ?

Men's Vs Womens Cricket: మహిళల క్రికెట్‌కి, పురుషుల క్రికెట్‌కి మధ్య తేడాలు ఉంటాయని తెలుసా ? క్రికెట్ ఆడే బంతి బరువు మొదలుకుని గ్రౌండ్ సైజ్ వరకు మెన్స్ క్రికెట్‌కి, ఉమెన్స్ క్రికెట్‌కి మధ్య పలు తేడాలు ఉంటాయి. అవి ఏంటనేది ఇప్పుడు మనం బ్రీఫ్‌గా ఓ లుక్కేద్దాం. 

  • Feb 14, 2023, 21:14 PM IST

Men's Vs Womens Cricket: మహిళల క్రికెట్‌కి, పురుషుల క్రికెట్‌కి మధ్య నిబంధనల విషయంలో పలు తేడాలు ఉంటాయి. బంతి బరువు నుంచి గ్రౌండ్ సైజ్, ఓవర్స్ పూర్తి చేసే సమయం, టెస్ట్ మ్యాచ్ ఎన్ని రోజులు ఆడాలి వంటి నిబంధనల గురించి ఇప్పుడు మనం ఓ స్మాల్ లుక్కేద్దాం. 

1 /6

ఒక్క టెస్ట్ మ్యాచ్‌కి ఎన్ని రోజులు మెన్స్ టెస్ట్ మ్యాచెస్ 5 రోజుల పాటు జరిగితే.. ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ మాత్రం కేవలం 4 రోజుల పాటే జరుగుతుంది. 

2 /6

Men's Vs Womens Cricket: రోజుకు ఎన్ని ఓవర్లు మెన్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఒక్క రోజుకు 90 ఓవర్లు ఆడాల్సి ఉండగా.. ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఒక్క రోజుకు 100 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.

3 /6

Men's Vs Womens Cricket: బంతి బరువు పురుషుల క్రికెట్‌లో బంతి బరువు కనీసం 156 గ్రాములు ఉండాలి. అదే మహిళల క్రికెట్ విషయానికొస్తే.. బంతి బరువు కనీసం 142 గ్రాములు ఉంటుంది.

4 /6

Men's Vs Womens Cricket: బౌండరీ సైజ్ మహిళల క్రికెట్‌లో బౌండరీ లైన్ రోప్స్ 55 నుంచి 64 మీటర్ల మధ్య దూరంలో ఉంటాయి. మెన్స్ క్రికెట్‌లో బౌండరీ రోప్స్ 59 మీటర్ల నుంచి 82 మీటర్ల మధ్య ఉంటాయి.

5 /6

Men's Vs Womens Cricket: డిఆర్ఎస్ ఉపయోగం ఉమెన్స్ టెస్ట్ క్రికెట్‌లో డిఆర్ఎస్ ఉపయోగించరు. అయితే పురుషుల క్రికెట్‌లో మాత్రం డిఆర్ఎస్ ఉపయోగిస్తారు.

6 /6

Men's Vs Womens Cricket: ఓవర్ పూర్తి చేసేందుకు పట్టే సమయం మహిళల క్రికెట్‌లో ఒక ఓవర్ పూర్తి చేయడానికి సగటున 3.6 నిమిషాలు సమయం పడుతుంది. కానీ పురుషుల క్రికెట్‌లో ఓవర్ పూర్తి చేసే సమయం సగటున 4 నిమిషాల సమయం తీసుకుంటుంది.