Bali: ఇండోనేషియాలోని బాలి ద్వీపం. దీనిని దేవతలు తిరిగే అద్భుత దీవిగా పిలుస్తుంటారు. ఈ పర్యాటక కేంద్రం పుణ్యస్థలంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలి వెళ్లేందుకు మహిళలు ఒంటరిగా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మహిళలను అంతగా ఆకర్షించేంత ప్రత్యేకత బాలిలో ఏముంది? తెలుసుకుందాం.
Bali Island in Indonesia: ఇండోనేషియాలోని బాలి ద్వీపం..ఒంటరి ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలకు స్వర్గధామం వంటిది. హనీమూన్ కోసం ప్లాన్ చేసే జంటలకు బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు. సాహసం, విశ్రాంతి, భద్రత ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. భూమిపై స్వర్గంగా పిలిచే బాలి అన్ని వయస్సుల వారిని ఆకట్టుకుంటుంది. బాలిలోని దట్టమైన పర్వతాల్లో మహిళలు ఒంటరికిగా ట్రెక్కింగ్ చేయవచ్చు. ప్రశాంతంగా ధ్యానం చేయవచ్చు. మహిళలు బాలిని ఇష్టపడేందుకు బోలెడు కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
మహిళలకు ప్రత్యేకమైంది: బాలి..భారతీయులకు అత్యంత తక్కువ ఛార్జీలతో వెళ్లే పర్యాటక ప్రాంతం. ఆసియాలోని సురక్షితమైన పర్యాటక ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ఫ్యామిలితో కానీ, ఒంటరిగా వెళ్లడం, మహిళలు ఒంటరిగా వెళ్లేందుకు సురక్షితం ప్రాంతం. ప్రధానంగా బాలినీస్ సంస్కృతి మహిళలను గొప్పగా చూసుకుంటుంది. ఒంటరి మహిళా ప్రయాణికులు వెళ్లేందుకు ఇది సౌకర్యవంతమైన ప్రదేశం. అలాని రాత్రిపూట ఒంటరిగా తిరగడం నిషేదం
సుపీరియర్ వెల్నెస్, రిలాక్సేషన్ సౌకర్యాలు: బాలిలో అనేక రకాల వెల్నెస్, రిలాక్సేషన్ సౌకర్యాలు ఉన్నాయి.ఇక్కడ బస చేసేందుకు సౌకర్యవంతమైన హోటల్స్ఉంటాయి. అంతేకాదు స్పా చికిత్సలు కూడా ఉంటాయి. యోగా, ధ్యానం, మానసిక ఆరోగ్యానికి అద్భుతమైన చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
అద్భుత పర్యాటక ఆకర్షణ: బాలిలో అందమైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి.బీచ్‌లోని లగ్జరీ విల్లాల్లో విశ్రాంతి తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.సాంప్రదాయ ఇండోనేషియా గ్రామం, సంస్కృతి,ప్రకృతి విశిష్ట అంశాలను ఇక్కడి ప్రజల్లో చూడవచ్చు.బాలి వెళ్లతే అక్కడ పవిత్ర కొలనును సందర్శించడం మర్చిపోవద్దు.
సాహస గమ్యస్థానాలు: బాలి..ఎత్తైన స్వింగ్‌కు ప్రసిద్ధి. ఇవే కాదు..బీచ్‌లలో ఉత్తేజకరమైన సాహస కార్యకలాపాలను చేయవచ్చు. ఇక్కడి స్వింగ్ అద్భుతమైన చిత్రాలు, ఉత్కంఠభరితమైన అటవీ వీక్షణలను అందిస్తుంది. దట్టమైన వర్షారణ్యాలు, సహజమైన బీచ్‌లు,అద్భుతమైన రైస్ టెర్రస్లతో బాలి ప్రకృతి నిజంగా అందంగా ఉంటుంది.
వంటకాలు:బాలి సాంప్రదాయ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి రుచి బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటుంది.జానికి ఈ ద్వీపం ఆహార ప్రియుల స్వర్గధామం.నాసి గోరెంగ్, సాటే వంటి రుచికరమైన బాలినీస్ వంటకాలను అలాగే అంతర్జాతీయ వంటకాలను అందిస్తుంది.
షాపింగ్: బాలి షాపు హోలిక్లకు స్వర్గంగా చెప్పవచ్చు.స్థానిక హస్తకళలు,సందడిగా ఉండే మార్కెట్ల నుండి డిజైనర్ దుస్తులుఅధునాతన ఆభరణాలతో కూడిన అత్యాధునిక వస్తువుల వరకు ఇక్కడ షాపింగ్ చేయవచ్చు.