Jr Ntr Car Collection: ప్యాన్ ఇండియా హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. త్రిపుల్ ఆర్ సినిమాతో మంచి పేరు పొందిన ఆయన ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమాతో బిజీగా ఉన్నారు. తారక్ తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును పొందారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన కారు కలెక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఉన్న లగ్జరీ కార్లేంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ ఉన్న లగ్జరీ కార్లలో గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఇది ఎంతో శక్తివంతమైన కారుగా పేరుంది. ఇది అద్భుతమైన స్పీడ్‌ను కలిగి ఉంటుంది.
విలాసవంతమైన SUVల్లో Mercedes-Benz GLS కారు ఒకటి. దీనిని జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ విహారయాత్రలకు లేదా లాంగ్ డ్రైవ్‌లకు ఎక్కువగా వినియోగిస్తారని సమాచారం.
రేంజ్ రోవర్ కార్ల గురించి చెప్పన్నక్కర్లేదు.. ఈ కార్లలో ఆఫ్ రోడ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ బ్రాండ్‌లో ఒకటైనా రేంజ్ రోవర్ వోగ్ కారు జూనియర్ ఎన్టీఆర్ ఉందని సమాచారం.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దీనిని ఫెమ్ ఉన్న వారు మాత్రమే కొనుగోలు చేస్తారు. అయితే ఈ కారు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉందని పుకార్లు వస్తున్నాయి.
ఫ్లాగ్షిప్ సెడాన్‌గా మార్కెట్లో మంచి పేరు పొందిన BMW 7-సిరీస్ జూనియర్ ఎన్టీఆర్ కారు కలెక్షన్లో ఒకటి. ఇది అద్భుతమైన ఇంటీరియర్ల్ కలిగి ఉంటుంది.
పోర్స్చే 718 కేమాన్ కారు గురించి ఎంత వివరించిన తక్కువే.. దీనిని సూపర్ కారుగా కూడా పిలుస్తారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ కారు కూడా ఉందని వార్తలు వచ్చాయి.
Jr NTR కారు కలెక్షన్లో గతంలో బెంట్లీ కాంటినెంటల్ GT కారు కూడా యాడ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఇంటీరియర్స్‌ను కలిగి ఉంటుంది.
అమెరికన్ లగ్జరీ కార్లలో కాడిలాక్ ఎస్కలేడ్ ఒకటి. ఇది ప్రీమియం లుక్‌తో పాటు చాలా లగ్జరీగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని శక్తివంతమైన కారుగా కూడా పిలుస్తారు. ఈ కారును కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే కొన్నారని వార్తలు వచ్చాయి.