8 Major Causes Of Diabetes: చాలా మందిలో మధుమేహం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో అధిక బరువు లేదా స్థూలకాయం కారణంగా కూడా ఈ సమస్య వస్తోంది. ఇవే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
8 Major Causes Of Diabetes: ప్రస్తుతం చాలా మందిలో చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్‌లో అనేక రకాల అనారోగ్య సమస్యలు దారి తీసే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా మంది మధుమేహం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల కూడా వస్తున్నాయి. అయితే ఈ చిన్న వయసుల్లో డయాబెటీస్ రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే తప్పకుండా తమ పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలా ఇప్పటికే ఇంట్లో మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
శరీరంలో ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయకుండా చేస్తుంది. దీని కారణంగా కూడా చాలా మందిలో మధుమేహం వస్తోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొంతమందిలో శరీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మధుమేహం వస్తోంది. కాబట్టి తప్పకుండా ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
వయస్సు పెరిగేకొద్దీ మధుమేహం వచ్చే అవకాశం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి 60 సంవత్సరాలు నిండిన వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భధారణ సమయంలో GDM ఉన్న మహిళలకు తర్వాత టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీరు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కారణంగా కూడా మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.