Delhi Air Pollution: దేశ రాజధానిలో పీక్స్ కు చేరిన వాయు కాలుష్యం..

Delhi Air Pollution: భారత దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి పీక్స్ కు చేరింది. దీపావళి పండగ తర్వాతి రోజు ఈ కాలుష్యం మరింత పెరిగింది.  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 999కు చేరింది.

1 /7

Delhi Air Pollution: ఢిల్లీ, ఎన్సీఆర్‌లో చాలా చోట్లా ఇదే దుర్భర పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని లోకల్ సర్కిల్స్ తన సర్వేలో స్పష్టంగా వివరించంది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రాం, ఫరీదాబాద్, గజియాబాద్‌ల నుంచి 21 వేల మంది నివాసుల నుంచి సేకరించిన శాంపుళ్ల నుంచి రూపొందించిన ఈ సర్వే ఢిల్లీలో నెలకొన్న తీవ్ర పరిస్థితులకు అద్ధం పడుతుంది.

2 /7

ఈ సర్వే ప్రకారం ఢిల్లీ, ఎన్సీఆర్‌లలో నివసిస్తున్న ప్రతి పది కుటుంబాలకుగాను.. ఏడు కుటుంబాల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారట. 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నారు. 62 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరికైనా కాలుష్యం వల్ల కళ్లు మండుతున్నాయి.

3 /7

46 శాతం కుటుంబ సభ్యులకు జలుబు, ముక్కుల్లో సమస్యలు ఉన్నాయి. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సమస్యలు ఉన్నట్టు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.  ఆస్తమ ఉన్నట్టు 31 శాతం మంది, తలనొప్పితో బాధపడుతున్నట్టు 31 శాతం మంది తెలిపారు.

4 /7

దీపావళి పండగ ఒక్కరోజు క్రాకర్స్ కాల్చినంత మాత్రానా.. ఈ పొల్యూషన్ ఉంటుందా కాదు. ఢిల్లీలో ప్రతి రోజు ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కేవలం దీపావళి టైమ్ లోనే హైలెట్ చేయడంపై కొంత మంది సనాతన వాదులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు మిగిలిపోయిన పంటలను అనాలోచితంగా కాల్చడం ద్వారానే ఎక్కువగా ఢిల్లీ కాలుష్యం బారిన పడుతుందంటున్నారు. ఈ విషయమైన సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన రైతులు పెద్దగా పట్టించుకోవడం లేదు. 

5 /7

యాంగ్జయిటీతో 23 శాతం మంది, నిద్రలేమి సమస్యతో 15 శాతం మంది బాధపడుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. 31 శాతం కుటుంబాలు మాత్రం కాలుష్యంతో పెద్దగా ఇబ్బందిపడటం లేదని పేర్కొన్నారు.కాలుష్యం అధికంగా ఉండే ఈ నిర్ణీత కాలం నుంచి తప్పించుకోవడానికి 23 శాతం కుటుంబాలు ఎయిర్‌ ప్యూరిఫయర్లు వాడుతున్నట్టు తెలిపారు.

6 /7

అదే శాతం కుటుంబాలు తాము ఈ కాలుష్యంలోనే ఎలాంటి సపోర్ట్ లేకుండా జీవిస్తున్నామని వివరించారు. 15 శాతం కుటుంబాలు మాస్క్ ధరించి పనులు చేసుకుంటున్నామన్నారు.  అదే సంఖ్యలో కుటుంబాలు ఆరోగ్యం కోసం తాము రోగనిరోధక శక్తినిచ్చే ఆహారం, పానియాలను తీసుకుంటున్నామని చెప్పారు.

7 /7

సుమారు 15 శాతం కుటుంబాలు ఈ కాలంలో తాము ఢిల్లీ వదిలి వేరే రాష్ట్రాలకు ప్రయాణించాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలిపారు. రెండు వారాల క్రితమే చేపట్టిన ఇలాంటి సర్వేలో 18 శాతం కుటుంబాలు ఎయిర్‌ ప్యూరిఫయర్లు వాడుతున్నట్టు చెప్పగా.. తాజా సర్వేలో ఈ సంఖ్య 23 శాతానికి పెరిగింది.