గతంలో రంజీల్లో రాణించి, అండర్19 జట్టులో సత్తా చాటి భారత జాతీయ జట్టులోకి వచ్చేవారు. ఇప్పుడు వీరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఓ కర్ట్ కట్లా మారింది. ఇక్కడ సంచలనాలు చేస్తే టీమిండియా నుంచి పిలుపు ఖాయమని భావిస్తారు. ఈ సీజన్ ద్వారా ఐపీఎల్‌కు పరిచయమైన కొందరు యువ ఆటగాళ్లు ప్రియం గార్గ్, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయి, తుషార్ దేశ్‌పాండేలు.. (Debutants In IPL 2020) అరంగేట్రంలోనే వెలుగులోకి వచ్చారు. ప్రతిభకు పదునుపెడితే జాతీయ జట్టులోకి రావడం ఏమాత్రం కష్టం కాదు.

టీమిండియా అండర్ 19 కెప్టెన్, యువ సంచలనం ప్రియం గార్గ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ మీద 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి నౌట్ట్గా నిలిచాడు. దాంతో 7 వికెట్ల తేడాతో సీఎస్కేపై సన్‌రైజర్స్ విజయం సాధించింది. అయితే మిడిలార్డర్లో సరైన సహకారం అందకపోవడంతో త్వరగా వికెట్ సమర్పించుకుంటున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సన్నింగ్ క్యాచ్‌లు అందుకుని ఫీల్డింగ్‌లోనూ ప్రయోజనకారి అని నిరూపించుకున్నాడు. (Pic courtesy: IPL)
అండర్ 19 వరల్డ్ కప్‌లో 6 మ్యాచ్‌లలోనే 17 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు 19 ఏళ్ల యువ సంచలనం రవి బిష్ణోయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ప్రస్తుత సీజన్లో ఐపీఎల్‌కు ఎంట్రీ ఇచ్చాడు. 9 మ్యాచ్‌లలో 9 వికెట్లు పడగొట్టి పరవాలేదనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అద్భుతమైన స్పెల్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.
2008లో 13 ఏళ్ల బాలుడు అయిన తుషార్ దేశ్‌పాండే, ముంబై ఇండియన్స్ జట్టుకు బాల్ బాయ్‌గా చేశాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. రెండు మ్యాచ్‌లాడి 3 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన ఈ అరంగేట్ర ఆటగాడు ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. (Pic courtesy: IPL)
ఐపీఎల్ 2020లో లక్కీ ఆటగాళ్లలో దేవదత్ పడిక్కల్ ఒకడని చెప్పవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఆర్సీబీ 6 మ్యాచ్‌లు గెలవగా అందులో పడిక్కల్ తన వంతు పాత్ర పోషించిన మ్యాచ్‌లే అధికం. మరోవైపు జీవనదానాలు (Dropped catches) ఇతడికి వరంగా మారుతున్నాయి. అలవోకగా హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. 9 మ్యాచ్‌లలో 296 పరుగులు చేశాడు. మంచి బ్యాట్స్‌మన్‌గా రాటుదేలడానికి మరింత సమయం పడుతుంది. (Pic courtesy: IPL)
Next Gallery