Corona Vaccine: దేశంలో 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా టీకాలు, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం

COVID-19 Vaccine For Above 45 Age In India | దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది.

1 /5

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60ఏళ్లు పైబడిన అందరికీ, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అందిస్తోంది. ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది. Also Read: COVID-19 Vaccine: కరోనా టీకాలు తీసుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది

2 /5

కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ నిర్ణయాన్ని వెల్లడించారు. భౌతికదూరం పాటించాలని, బయటకు వెళితే కచ్చితంగా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను కోరింది. కోవిడ్-19 నిబంధనలు తప్పక పాటించాలని, లేకపోతే కరోనా కేసులు భారీగా పెరుగుతాయని హెచ్చరించింది. Also Read: Map My India APP: మీకు దగ్గర్లోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఇలా తెలుసుకోండి

3 /5

ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 వయసు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మండలి సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 40,715 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది.

4 /5

ప్రస్తుతం దేశంలో 40 వేల వరకు కరోనా పాజిటివ్ నమోదు అవుతున్నాయి. అందులో 60 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర నుంచే నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజా కేసులలో అత్యధికంగా మహారాష్ట్రలో 24,645 కేసులు, ఆ తరువాత పంజాబ్ 2,299, గుజరాత్ నుంచి 1,640 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Also Read: Corona Vaccination: ఈ వ్యాధులు ఉన్నాయా, అయితే COVID-19 Vaccine తీసుకునేందుకు అర్హులు అవుతారు

5 /5

భారత్‌లో తొలి దశ కరోనా వ్యాక్సినేషన్‌లో పారిశుధ్య కార్మికులు, వైద్యులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఉచితంగా కరోనా టీకాలు జనవరిలో ప్రారంభించారు. ఫిబ్రవరి 60 ఏళ్లు పైబడిన అందరికీ, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొన్న వారికి రెండో దశలో కరోనా టీకాలు ఇస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.  Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook