World Highest Highway: ప్రపంచంలోనే అతి ఎత్తైన హైవే, 116 అంతస్థుల ఎత్తులో

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థగా మారుతున్న చైనా ప్రతి రంగంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం చూస్తుంటే హ్యాట్సాఫ్ అనక తప్పడంలేదు. ఇప్పుడు కొత్తగా నిర్మించిన హైవే ప్రపంచంలోనే అతి ఎత్తైన హైవే. 116 అంతస్థుల కంటే ఎత్తైంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

World Highest Highway: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థగా మారుతున్న చైనా ప్రతి రంగంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం చూస్తుంటే హ్యాట్సాఫ్ అనక తప్పడంలేదు. ఇప్పుడు కొత్తగా నిర్మించిన హైవే ప్రపంచంలోనే అతి ఎత్తైన హైవే. 116 అంతస్థుల కంటే ఎత్తైంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

1 /6

చైనాలో ఈ వంతెనను కొండపై పర్చుకున్న భారీ డ్రాగన్‌లా నిర్మించారు. ప్రపంచంలోని ఎత్తైన వంతెనల్లో ఇదొకటి.

2 /6

ఈ మొత్తం హైవేలో అద్భుతమంటే మూడంతస్తుల  గోళాకారంలోని లూప్ బ్రిజ్. ఇది జపాన్‌కు చెందిన కావాజూ నానాదారు లూప్ బ్రిజ్‌లా 350 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 

3 /6

ఈ హైవే ప్రారంభం నుంచి తుది వరకూ ఎత్తు భూమి కంటే 350 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మీకు సులభంగా అర్ధం కావాలంటే 116 అంతస్థుల కంటే ఎత్తైన హైవే ఇది.

4 /6

చైనాలో ఆకాశాన్ని అంటుతున్న ఈ హైవే నిర్మాణం 2018 మార్చ్ నెలలో ప్రారంభైంది. 2019 మేలో రాకపోకలు ప్రారంభమయ్యాయి.

5 /6

ఈ హైవే చూసేందుకు కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ రోడ్డు పొడుగు 30 కిలోమీటర్లు. ఈ హైవేపై 4 వంతెనలు, ఒక సొరంగం ఉంది. 

6 /6

ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించే హైవే ఇది. తియాన్ లాంగ్షాన్ పర్వతంపై నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వే ఇది. ఈ హైవే ఎత్తు సముద్రమట్టానికి 1.364 మీటర్లు అంటే 4,475 అడుగుల ఎత్తులో ఉంది.