Cheapest 7 Seater Cars: 10 లక్షల కంటే తక్కువకు లభించే 7 సీటర్ కార్లు ఇవే

మార్కెట్‌లో 7 సీటర్ కార్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్ల వివరాలు మీ కోసం అందిస్తున్నాం. దేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న 7 సీటర్ కార్లు ఇవే.

Cheapest 7 Seater Cars: మార్కెట్‌లో 7 సీటర్ కార్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్ల వివరాలు మీ కోసం అందిస్తున్నాం. దేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న 7 సీటర్ కార్లు ఇవే.

1 /5

రీనాల్ట్ ట్రైబర్ రీనాల్ట్ ట్రైబర్ కారు అత్యంత తక్కువ ధరకు లభించే 7 సీటర్ కారు. ఈ కారు ధర 5.92 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో పాటు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రోజెక్టర్ ఉన్నాయి. 

2 /5

మారుతి సుజుకి ఎర్టిగా దేశంలో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న ఎంపీపీవీ మారుతి సుజుకి ఎర్టిగా. దీని ధర 8.35 లక్షల్నించి ప్రారంభమౌతుంది. క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.

3 /5

మహీంద్రా బొలేరో నియో మహీంద్రా బొలేరో నియో కూడా చాలా ప్రసిద్ధి చెందిన మోడల్. దీని ధర 9.49 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో కూడా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 100 పీఎస్ 260 ఎన్ఎం జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. 

4 /5

మహీంద్రా బొలేరో మహీంద్రో బొలేరో ఏళ్ల తరబడి ప్రజల మనస్సుల్ని దోచుకుంటున్న వాహనం. బొలేరో ధర 9.53 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్, ఎయిర్ కండీషనింగ్ వంటి సౌకర్యాలున్నాయి.

5 /5

భారతీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ తరువాత 7 సీటర్ కార్లకే డిమాండ్ పెరుగుతోంది. కమర్షియల్ రూపంలో కూడా ఈ కార్ల వినియోగం పెరుగుతోంది. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్ల వివరాలు మీ కోసం అందిస్తున్నాం. దేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న 7 సీటర్ కార్లు ఇవే.