Black Tomato Business Idea: ప్రస్తుతం మార్కెట్లో చిన్న వ్యాపారాలకు అధిక డిమాండ్ ఉంది. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాల కంటే విభిన్నంగా ఆలోచించడం, అధిక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ వ్యాపారం మీకు బోలెడు లాభాలు తీసుకురావడం ఖాయం.
చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి అధిక పెట్టుబడి, పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. చిన్న ఓ ఆలోచన, బిజినెస్ నడిపించే తెలివి తేటలు ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు తెలుసుకొనే బిజినెస్ ఇంట్లో మహిళలు, యువతకు మాత్రమే కాకుండా రైతులకు కూడా ఉపయోగపడేది. ఈ బిజినెస్‌తో అనుకున్నదాని కంటే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు.
నల్ల టమోటాల బిజినెస్ రైతులకు ఒక వరం లాంటిది. ఈ వ్యాపారానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.
నల్ల టమోటాలు ప్రస్తుతం మార్కెట్ దృష్టిని మళ్లిస్తున్నాయి. ఎర్రటి టమోటాల కంటే ఇవి బాగా అమ్ముడుపోతాయి.
నల్ల టమోటాలు కేవలం రంగులో మాత్రమే కాదు, పోషక విలువల్లో కూడా ఎర్రటి టమోటాల కంటే భిన్నంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
ఈ నల్ల టమోటా పంటను ఎక్కడైనా సాగు చేయవచ్చు. కానీ ఇవి ఎక్కువగా వేడి ఉన్న వాతావరణంలో అధికంగా పండుతాయి.
నల్ల టమోటాలను ఎక్కువగా జనవరి నెలలో సాగు చేయడం మంచిది. మార్చి, ఏప్రిల్ మధ్య మార్కెట్లో టమోటాలను అమ్మవచ్చు.
ఈ పంటకు కేవలం విత్తనాలు ఉంటే సరిపోతుంది. నల్ల టమోటా సాగులో హెక్టారుకు 4 నుంచి 5 లక్షల లాభం వస్తుంది.