Ilachi Best Remedies: ప్రతి ఇంట్లో కిచెన్‌లో లభించే వస్తువుల్లో ఒకటి ఇలాచీ. సాధారణంగా స్వీట్స్‌లో రుచి, ఫ్లేవర్ కోసం వాడుతుంటారు. కానీ ఆరోగ్యపరంగా ఇలాచీతో చాలా ప్రయోజనాలున్నాయి. ఇదే ఇలాచీనీ రోజూ భోజనం తరువాత తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ఇలాచీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి నష్టం కల్గించే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి.
రుచి పెరగడం ఇలాచీ ఫ్లేవర్ అనేది నోటి రుచిని పెంచుతుంది. భోజనం తరువాత ఇలాచీ తింటే ఫ్రెష్‌నెస్ ఉంటుంది.
ఎసిడిటీ నుంచి ఉపశమనం ఇలాచీ తినడం వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తదు. ప్రత్యేకించి ఎసిడిటీ సమస్యతో బాధపడేవారికి ఛాతీలో మంట ఉంటుంది. ఇలాంటి సమస్యకు ఇలాచీ బెస్ట్
ఫ్రెష్ బ్రీత్ ఇలాచీ ఒక సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ ఫ్రెష్‌నర్‌లా పనిచేస్తుంది. ఇలాచీ తినడం వల్ల నోటి దుర్గంధం పోతుంది.
కడుపులో స్వెల్లింగ్ సమస్య జీర్ణక్రియలో సమస్య ఉంటే కడుపులో స్వెల్లింగ్ ఉంటుంది. నొప్పి కూడా ఉండవచ్చు. ఇలాంటప్పుడు ఇలాచీ నమిలి తింటే వెంటనే ఉపశమనంలభిస్తుంది
వాంతుల నుంచి ఉపశమనం ఎవరికైనా వాంతులు వస్తుంటే వెంటనే ఇలాచీ ఉడికించిన నీరు తాగించాలి. వెంటనే ఉపశమనం లభిస్తుంది.
మూడ్ సెట్టింగ్ భోజనం తరువాత ఇలాచీ తినడం వల్ల మూడ్ మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
మెటబోలిజం వేగవంతం బోజనం చేసిన తరువాత ఇలాచీ తినడం వల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. శరీరంలో న్యూట్రిషన్ సంగ్రహణను పెంచుతుంది. బరువు తగ్గించవచ్చు
భోజనం తరువాత బరువుగా ఉండటం ఒక్కోసారి భోజనం ఎక్కువగా తింటే ఆ కారణంతో కడుపు బరువుగా ఉండటం, వాంతి వచ్చేట్టు ఉండటం జరగవచ్చు. ఇలా ఉంటే ఒక ఇలాచీ నమిలితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది