Budget 2023: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించింది వీరే..!

Budget 2023: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదోసారి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. 2023 బడ్జెట్ రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం. 
 

Budget 2023: మరికాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.  మోడీ ప్రభుత్వం 2.0కి ఇదే చివరి పూర్తి బడ్జెట్. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు ఈ బడ్జెట్‌ను నిశితంగా గమనిస్తున్నారు. అయితే ఈసారి బడ్జెట్‌ను రూపొందించిన వ్యక్తులు ఎవరో తెలుసా?.
 

1 /6

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత అందుకోనున్నారు.   

2 /6

ప్రస్తుత ఆర్థిక కార్యదర్శి T.V. సోమనాథన్. 1987 బ్యాచ్ IAS అధికారి. ఆయన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన 2015 నుండి 2017 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో కూడా పనిచేశారు.   

3 /6

ఈయన పేరు అజయ్ సేథి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. కర్ణాటక కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బడ్జెట్ మేకింగ్ టీమ్‌లోని అతి ముఖ్యమైన సభ్యులలో ఈయన ఒకరు. G20 సెంట్రల్ బ్యాంక్ మరియు ఆర్థిక మంత్రి సమావేశాలకు సహ-అధ్యక్షునిగా వ్యవహారిస్తున్నారు.  

4 /6

మోదీ ప్రభుత్వం అనేక రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం DIPAM అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. దీనికి తుహిన్ కాంత పాండే కార్యదర్శిగా ఉన్నారు. ఈయన ఎయిరిండియా అమ్మకంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు  

5 /6

సంజయ్ మల్హోత్రా ఇటీవలే రెవెన్యూ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఆయన ఆర్థిక సేవల విభాగంలో ఉన్నారు. ఆదాయ అంచనాలను సమతూకం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషిస్తారు.  

6 /6

ఆర్థిక శాఖలో వివేక్ జోషి కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ముఖ్యమైన బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో బ్యాంకింగ్ రంగంలో తీసుకున్న నిర్ణయాల్లో ఈయనదే ముఖ్యపాత్ర.