BSNL 4G Net work: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరల పూర్వవైభవం దిశగా దూసుకుపోతుంది. ఇటీవల భారీగా ఎయిర్ టెల్, జియో, వోడొ ఫోన్ ల యూజర్లు బీఎస్ఎన్ కు పోర్ట్ అవుతున్నారు.
బీఎస్ఎన్ఎల్ మరల దేశంలో దిగ్గజ నెట్ వర్క్ స్థానాల సరసన చేరబోతుంది. దీనికి ఎక్కువగా కాలంకూడా పట్టదని కొన్ని అంశాలను పట్టిచూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎయిర్ టెల్, జియో, వోడా ఫోన్ లను భారీగా తమ సేవా చార్జీల రెట్లు పెంచేశాయి. దీంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అవుతున్నట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు కొన్ని టెలికాం సర్కిల్స్ లలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది మొబైల్ వినియోగ దారులు బీఎస్ఎన్ఎల్ కు మరల పోర్ట్ అవుతున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ ఇప్పటికే కొన్ని టెలికాం సర్కిల్‌లలో తన 4జీ సేవలను ప్రవేశపెట్టింది. ఈమధ్య కొన్ని ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలను అందించే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ 365 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధరలోనే ప్లాన్లను అందిస్తోంది.
జులై 3, 4 తేదీలల్లో జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ కంపెనీలు తమ టారీఫ్ ధరలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో చాలా మంది బీఎస్ఎన్ఎల్ వైపుకు వెళ్లారు. దీంతో కేవలం రెండు వారాల వ్యవధిలోనే.. రెండున్నర లక్షల మంది మొబైల్ పోర్టబిలీటీ ద్వారా నెట్ వర్కులను మార్చుకున్నట్లు సమాచారం.
అంతేకాకుండా.. రికార్డుస్థాయిలో మరో 25 లక్షల మంది కొత్త కనెక్షన్ లను తీసుకున్నట్టు కూడా సమాచారం. అదే విధంగా అనేక ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డుల అమ్మకాల కేంద్రాలు కూడా ఫుల్ రష్ తో ఉంటున్నాయంట. దీంతో మరల బీఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు రాబోతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా అన్ లిమిటెడ్ కాల్స, డేటాలు 28 రోజులకు గాను.. ప్రైవేటు కంపెనీలు రూ. 189, 199 చార్జీలు చేస్తుంటే.. బీఎస్ఎన్ ఎల్ మాత్రం.. కేవలం రూ. 108 కి మాత్రమే ఈ బెనిఫిట్స్ అందిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 1198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్, రూ. 1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లు, బీఎస్ఎన్ఎల్ రూ. 2999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్ ధర రూ. 2999కాగా ఇది 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ప్రతి రోజు 3 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో అపరిమిత కాల్స్ సదుపాయం అందిస్తుంది.