Viral News: ఇప్పటికి కూడా బొర్నియా ఐలాండ్ లోని ప్రజలు మూడు రోజులు పాటు కొత్త జంటలను ఒకేగదిలో పెట్టి లాక్ చేస్తారంట. గదిలో టెస్టీ ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, పాలు పెడతారంట. కానీ బాత్రూమ్ లు మాత్రం అస్సలు ఉండవంట.
సాధారణంగా ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ ఆచారం, పద్దతులు ఉంటాయి. కొన్ని చోట్ల ఉండే ఆచారాలు వింటే నవ్వొస్తుంది. మరికొన్ని ఆచారాలు తెలుసుకుంటే మాత్రం వెన్నులో వణుకుపడుతుంది. ఇలాంటి ఒక ఆచారం నుంచి ఐస్ లాండ్ లో బొర్నియా ప్రజలు ఆచారిస్తారంట..
పెళ్లి తర్వాత మూడు రాత్రులు శోభనం కార్యక్రమం కామన్ గా జరిగేదే. గదిలో పూలు, సుగంధ ద్రవ్యాలు, టెస్టీ ఫ్రూట్స్, పాలు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు చాలా ఇళ్లలో గదిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటాయి. బాత్రూమ్ లు కూడా ఉంటాయి.
నార్మల్ గా తొలిరాత్రి సంభోగం తర్వాత చాలా మంది, బాత్రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అవుతుంటారని చెబుతుంటారు. కొందరు మరల స్నానం చేసి, తమ శరీరంలోని ఒత్తిడిని దూరం చేసుకుంటారు. మరల కలవడానికి ప్లాన్ లు చేసుకుంటారు. ఇది కామన్ గా జరిగేదే..
కానీ బొర్నియా ఐలాండ్ లో గిరిజన తెగలు వింత ఆచారంను పాటిస్తారంట. ఇక్కడి గిరిజనులు పెళ్లి జరిగాక మూడు రోజుల పాటు శోభనందగ్గరుండి జరిపిస్తారంట. ఒకగదిలో పెళ్లైన కొత్త జంటలను పంపిస్తారంట. అక్కడ తినడానికి ఫుడ్, పానీయాలు, అన్ని ఏర్పాటు చేస్తారంట. మూడు రోజులు పగలు, రాత్రులు వీరి బయటకు రాకూడదు..
ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ గదిలో మాత్రం బాత్రూమ్ లు ఉండవంట. అంటే మూడు రోజులు కూడా కొత్త జంట అస్సలు టాయ్ లెట్ గానీ, బాత్రూమ్ లకు వెళ్లొద్దంట. అది అక్కడ ఆచారంగా పాటిస్తున్నారు. మూడు రోజులు కూడా ఉక్కపట్టుకుని ఉండాలంటా..
అయితే.. ఇలా ఈ ఆచారంను పాటిస్తే ఒకరిపట్ల మరోకరికి బంధం, ప్రేమ బలపడుతాయంట. బంధంఎక్కువగా కాలం నిలుస్తుందంట. ఎవరైన అర్జంట్ అని బాత్రూమ్ కువెళ్లిన లేదా గదిలో నుంచి బైటకు రావాలని ప్రయత్నం చేసిన కొన్నిరోజులకు చనిపోతారంట. ఈ నియమాన్ని, అక్కడి గిరిజన ప్రజలు ఆచరిస్తు వస్తున్నారు.
అసలు.. శోభనం మాట పక్కన బెడితే.. మూడు రోజులు ఒకేగదిలో ఉండి, బాత్రూమ్ కు వెళ్లకుండా ఎలా ఉంటారని, ఇలా చేస్తే లేని రోగాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. టెక్నాలజీ యుగంలో కూడా ఇదేం ఆచారంరా బాబు.. అంటూ చాలా మంది దీనిపై షాక్ కు గురౌతున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఉంటే ఇంకేం ఎంజాయ్ చేస్తారని కూడా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.