BSNL: బీఎస్ఎన్ఎల్ నెట్ స్పీడ్ తక్కువగా వస్తుందా? వెంటనే ఈ సెట్టింగ్ మార్చి చూడండి..

BSNL Net Speed: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తుంది. పెరిగిన టెలికాం ధరల తర్వాత భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL)అద్భుతమైన ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకువస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4జి సేవలను ప్రారంభించడానికి తీవ్ర కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాది 5జీ సేవలను కూడా ప్రారంభిస్తామని చెప్పింది.
 

1 /5

అయితే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ స్పీడ్ తక్కువగా ఉందా సో మీ ఫోన్ లో ఈ సెట్టింగ్ మార్చి చూడండి డేటా స్పీడ్ అమాంతం పెరుగుతుంది.  

2 /5

బిఎస్ఎన్ఎల్ టవర్ లో ఏర్పాటును కూడా విస్తృతం చేసింది ఇప్పటికే చాలా వరకు అన్ని ప్రాంతాల్లో ఫోర్ జి సేవలను కూడా ప్రారంభించింది.  

3 /5

అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్ స్పీడ్ తక్కువగా వస్తుంది దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్యూనికేషన్ (DoT) 700MHz, 2100 MHz ఫ్రీక్వెన్సీ లని బిఎస్ఎన్ఎల్ కి కేటాయించింది.  

4 /5

బిఎస్ఎన్ఎల్ 4g సేవలు నెట్ స్పీడ్ రావాలంటే యూజర్లు 5g యాక్సెస్ చేయగల స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండాలి. ఇందులో 700 MHz ఫ్రీక్వెన్సీ ఉంటే 5g టెక్నాలజీ తో నెట్ స్పీడ్ అందుకుంటుంది.  

5 /5

మీ స్మార్ట్ ఫోన్లోనే 'సెట్టింగ్స్'  లోకి వెళ్లి నావిగేట్ చేయాలి. అందులో 'సిమ్‌ కార్డు' ఆప్షన్ ని ఎంచుకొని బిఎస్ఎన్ఎల్ సిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. బిఎస్ఎన్ఎల్ సిం హైలెట్ అయిన వెంటనే 4g లేదా 5g లేదా LTE కనెక్టివిటీకి ఎంచుకోవాలి. దీంతో మునుపటి కంటే ఇప్పుడు మీ బిఎస్ఎన్ఎల్ నెట్ స్పీడ్ పెరుగుతుంది.