Bollywood Actors: యాక్టింగ్, సింగింగ్ ప్రావీణ్యం ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ బాలీవుడ్ స్టార్స్

Bollywood Actors: బాలీవుడ్‌లో చాలామంది సెలెబ్రిటీలున్నా కొందరు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ కొందరిలో మల్టీ ట్యాలెంటెడ్ సామర్ధ్యముంది. అంటే నటనతో పాటు పాటలు కూడా చక్కగా పాడగలరు. లేదా వాయిస్ కమాండ్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంటారు. 
 

Bollywood Actors: మల్టీ ట్యాలెంటెడ్ స్టార్స్ చాలా తక్కువమంది ఉంటారు. అంటే నటనతో పాటు మరో రంగంలో ప్రావీణ్యం కలిగినవారు. ముఖ్యంగా అద్భుతంగా పాటలు పాడగలిగే బాలీవుడ్ నటులు కొందరున్నారు. ఇందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం ఉండటం విశేషం.

1 /5

శ్రద్ధా కపూర్ తన మధురమైన గొంతుకతో ఎవరినైనా ఆకట్టుకోగలదు. గలియా, బేజుబా ఫిర్ సే, సబ్ తేరా వంటి పాటలతో అందర్నీ ఆకట్టుకుంది.

2 /5

ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. హేంగోవర్, చాందీకీ డాల్ పర్, మే తేరా హీరో వంటి పాటలతో ఆకట్టుకున్నాడు. ఇక బిగ్‌బాస్ యాంకరింగ్‌తో సల్మాన్‌ను ఢీకొట్టేవాళ్లే లేరు. 

3 /5

ఫర్హాన్ అఖ్తర్ మల్టీ ట్యాలెంటెడ్ నటుల జాబితాలో మూడవ వ్యక్తి. ఎందుకంటే ఇతడికి నటనతో పాటు ఫిల్మ్ మేకింగ్, రైటింగ్, సింగింగ్ రంగాల్లో మంచి ప్రావీణ్యముంది. రాక్ ఆన్ పాట పాడింది ఇతడే.

4 /5

ఆయుష్మాన్ ఖురానా..బాలీవుడ్ మల్టీ ట్యాలెంటెడ్ నటుల జాబితాలో అగ్రస్థానంలో ఉంటాడు. మిట్టీ దీ ఖుష్బూ, సాడ్డీ గలీ ఆజా, యహీ హూ మై, పానీ దా రంగ్, నజ్మ్-నజ్మ్ వంటి పాటలు ఇతడు పాడినవే

5 /5

అలియా భట్ బాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్ ఉన్న నటి. అలియా భట్ ఇటీవలే సంఝావా, ఎక్ కుడీ వంటి హిట్ పాటలు పాడింది.