Bitter Gourd Benefits: మధుమేహంతో బాధపడుతున్నారా.. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ చిట్కా పాటించండి..

Bitter Gourd Tea: మన శరీరానికి ఉపయోగపడే వివిధ రకాల కూరగాయల్లో చేదుగా ఉండే కాక‌ర‌కాయ‌లు ఒక‌టి. ఈ కాకరను కొందరు ఇష్టపడి తింటే మరి కొందరూ కష్టపడి తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సి అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి.

  • Aug 22, 2022, 14:45 PM IST

Bitter Gourd Tea: మన శరీరానికి ఉపయోగపడే వివిధ రకాల కూరగాయల్లో చేదుగా ఉండే కాక‌ర‌కాయ‌లు ఒక‌టి. ఈ కాకరను కొందరు ఇష్టపడి తింటే మరి కొందరూ కష్టపడి తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సి అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి. అయితే కాకరలో ఉండే ప్రయోజనాలకన్న వీటితో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ టీని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల శరీరానికి మంచి లాభాలు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల శరీరంలో ఉత్పన్నమయ్యే అన్ని అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

1 /5

కాకర టీలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువ కావున శరీరానికి చాలా రకాల లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ టీ కరోనా వల్ల శరీరం దెబ్బతిన్న వారికి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది. ముఖ్యంగా పొట్టలో సమస్యలను దూరం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.  

2 /5

ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ టీ మంచి ఔషధంగా పని చేస్తుంది.

3 /5

కాకర టీలో శరీర సమస్యలను దూరం చేసే చాలా రకాల మూలకాలు ఉంటాయి. ఇవి గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశనం కలిగిస్తుంది. ఈ సమస్యల నుంచి సులభంగా నియంత్రిస్తుంది. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

4 /5

మధుమేహంతో బాధపడుతున్నవారికి ఇది ఔషధంలా పని చేస్తుంది. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ టీని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  ర‌క్తంలో చక్కెర స్థాయిలు త‌గ్గి మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

5 /5

కాకరను ఎండలో వేసి వాటిని వరుగుల్లా చేసి సీసాలో నిల్వ చేయాలి. అయితే ఈ ముక్కలను ఎప్పడు కావాలంటే అప్పుడు వీటిని నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకుంటే.. శరీరానికి చాలా మంచిదని నిపుణులు తెలువుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది.