Bigg Boss Vishnu Priya: ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లనంటూ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి జంప్.. యాంకర్ విష్ణు ప్రియపై ట్రోల్స్

Bigg Boss Vishnu Priya Pics: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‍బాస్ తెలుగు సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లను ఏడు జంటలుగా హౌస్‍లోకి పంపించారు. యాంకర్ విష్ణు ప్రియ ఈసారి హౌస్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తోంది. ఈ భామ బిగ్‌బాస్‌లోకి వెళుతుందని చాలా రోజులుగా రూమర్లు రాగా.. చిరకు అదే నిజమైంది. అయితే గతంలో ఆమె బిగ్‌బాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
 

1 /8

ముందుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది విష్ణు ప్రియ. తెలుగు, తమిళ భాషల్లో చిన్న చిన్న పాత్రలతో అవకాశాలు వచ్చినా.. పెద్దగా గుర్తింపు దక్కలేదు.   

2 /8

దీంతో బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్‌తో కలిసి పోవే పోరా షోకు హోస్ట్‌గా పనిచేసింది. ఈ షోతో మంచి పాపులారిటీ దక్కించుకుంది.  

3 /8

ఆ తరువాత కొన్ని టీవీ షోలకు యాంకర్‌గా వర్క్ చేసి.. బుల్లి తెర ఆడియన్స్‌ను అలరించింది.  

4 /8

తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే గతంలో ఈ భామ బిగ్ బాస్ గురించి చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి.  

5 /8

బిగ్‍బాస్ హౌస్‌లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనని.. కనీసం ఎంకరేజ్ కూడా చేయనని చెప్పింది.  

6 /8

ఎన్ని కోట్లు ఇచ్చినా తాను వెళ్లనన స్పష్టం చేసింది. ప్రపంచం చాలా బ్యూటీఫుల్‌గా బయట ఉన్నప్పుడు ఎందుకు ఏదో హౌస్‌లో ఉండాలని అడిగారు.  

7 /8

తాను ఇంట్లో వాళ్లను చూసుకోవాలని చెప్పింది విష్ణుప్రియ. తాను బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదని తెలిపింది.  

8 /8

ఈ వీడియో ఐదేళ్ల క్రితంది కాగా..  ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొందరు ట్రోల్స్ చేస్తుండగా.. మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.