Who will be the Bigg Boss Telugu season 4 winner | బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ గేమ్ షోకు తెరపడే సమయం ఇంకెంతో దూరంలో లేదు. రేపటి ఆదివారం డిసెంబర్ 20వ తేదీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగియనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ ఎవరనేది రేపటితో తేలిపోనుంది.
Bigg Boss Telugu season 4 grand finale episode on December 20 | బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ గేమ్ షోకు తెరపడే సమయం ఇంకెంతో దూరంలో లేదు. రేపటి ఆదివారం డిసెంబర్ 20వ తేదీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగియనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ ఎవరనేది రేపటితో తేలిపోనుంది. బిగ్ బాస్ 4 తెలుగు ఫైనలిస్టులు అయిన అభిజీత్, అఖిల్, సోహెల్, అరియానా గ్లోరి, దేత్తడి హారికలను గెలిపించేందుకు వారి అభిమానులు ఓటు వేసే గడువు కూడా ఇప్పటికే ముగిసిపోయిన ఈ నేపథ్యంలో ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టంట్స్ అభిజీత్, హారిక, అరియానా, సోహెల్, అఖిల్‌లో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువున్నాయి అనే కోణంలో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.
బిగ్ బాస్ 4 తెలుగు టైటిల్ గెల్చుకోబోయే విజేత గురించి బిగ్ బాస్ 3 ఫేమ్ అలీ రెజా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సత్తా ఉన్న అర్హులే బిగ్ బాస్ టైటిల్ గెల్చుకుంటారని.. ఆ సత్తా సోహెల్‌లో ఉందని తాను విశ్వసిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ( Image credits : Twitter photos )
గత కొద్ది వారాలుగా సయ్యద్ సోహెల్కి బయటి నుంచే మద్దతుగా పలుకుతున్న అలీ రెజా.. సోహెల్ తనకు గత 8 ఏళ్లుగా తెలుసునని, అతడు తనకు తమ్ముడు లాంటి వాడు అని అన్నాడు. ( Image credits : Ali Reza Twitter )
సోహెల్ కూడా ఓ ముస్లిం కాబట్టే అలీ రెజా అతడికి మద్దతు ఇస్తున్నాడని వస్తున్న ఆరోపణలను అలీ ఖండించాడు. అలా మతాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పటివరకు ఏ పని చేయలేదని చెప్పిన అలీ రెజా... నిజంగానే సోహెల్ మంచివాడని, అందుకే తాను సోహెల్ పక్షాన నిలిచానని అన్నాడు. ( Image credits : Twitter @ryan_sohel )
తాను బిగ్ బాస్‌లో పాల్గొంటున్నానని సోహెల్ చెప్పినప్పుడే అతడికి నేను ఓ కండిషన్ పెట్టానని, నువ్వు బాగా పర్ఫామ్ చేస్తేనే నీకు మద్దతు ఇస్తానని సోహైల్‌కి చెప్పానని అలీ రెజా గుర్తుచేసుకున్నాడు. తాను షరతు విధించినట్టుగానే సోహెల్ 2-3 వారాల పర్ఫార్మెన్స్ చూశాకే అతడు ఫైనల్స్ వరకు వెళ్తాడనే నమ్మకం ఏర్పడిందని అలీ రెజా చెప్పుకొచ్చాడు. ( Image credits : Twitter @ryan_sohel )
''సోహెల్ బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లక ముందే అతడికి ఇన్పుట్స్ ఇచ్చే క్రమంలోనే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాను. బిగ్ బాస్ సీజన్స్ అన్ని ఒకేలా ఉండకపోవచ్చు. నాకు వచ్చిన టాస్కులే నీకు వస్తాయని కూడా అనుకోలేం. అందుకే ఏ సందర్భంలోనైనా సరే నువ్వు నీలాగే ఉండు.. సందర్భాన్నిబట్టి స్పందించు. అలాగే బిగ్ బాస్ టైటిల్ గెలవడం కంటే ముఖ్యమైనది నువ్వు నీ ప్రత్యేకతను చాటుకోవడం'' అని వివరించాను. సరిగ్గా సోహెల్ ( Sohel ) కూడా అలాగే చేశాడు అని అలీ రెజా అభిప్రాయపడ్డాడు. ( Image credits : Twitter @ryan_sohel )
'' నామినేషన్స్ గురించి భయపడొద్దని చెప్పాను. ఎందుకంటే నామినేషన్స్‌లో లేకపోతే.. పబ్లిక్ ఓటింగ్‌లో మనం ఉండే అవకాశం కూడా ఉండదు. పబ్లిక్ మనకు ఓటు వేయాలి అంటే మనం నామినేషన్స్‌లో ఉండాలి. లేదంటే వాళ్లకు మనకు ఓటు వేసే అలవాటు కూడా ఉండదు'' అని సోహెల్కి సూచించినట్టు అలీ రెజా ( Ali Reza ) తెలిపాడు. ( Image credits : Twitter @ryan_sohel )
సోహెల్ గురించి అనేక విషయాలు గొప్పగా చెప్పుకొచ్చిన అలీ రెజా.. సోహెల్ వల్లే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 షో ముందుకు నడిచింది కానీ కొంతమంది అనుకుంటున్నట్టుగా అభిజీత్ ( Bigg boss contestant Abhijeet ) వల్ల కాదు అంటూ అభిజీత్ విన్నింగ్ ఛాన్సెస్‌పై బిగ్ బాంబ్ వేసే ప్రయత్నం చేశాడు. ( Image credits : Twitter @ryan_sohel )
మరి అలీ రెజా అంచనా వేస్తున్నట్టుగా సోహెల్ విన్ అవుతాడా లేదా అనేది తెలియాలంటే రేపటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 షో గ్రాండ్ ఫైనాలె ఎపిసోడ్ ( Bigg Boss Telugu 4 grand finale episode ) వరకు వేచిచూడాల్సిందే. ( Image credits : Twitter @ryan_sohel ) Also read : Jr NTR remuneration: జూనియర్ ఎన్టీఆర్ టీవీ షో పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే Also read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4: ఆమె పట్ల మరింత ఓపెన్ అవుతున్న అభిజీత్ Also read : Funny Memes On Bigg Boss Telugu 4: కడుపుబ్బా నవ్వించే ఫన్నీ మీమ్స్, జోక్స్!