Lasya Manjunath : లాస్య ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. చిన్న కొడుకుని చూపించిన యాంకర్

Anchor Lasya Second Son యాంకర్ లాస్య ఈ మధ్యే మరోసారి తల్లైన సంగతి తెలిసిందే. రెండో బిడ్డకు జన్మను ఇచ్చానంటూ లాస్య ఎంతో సంతోషంగా పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాస్య రెండు కొడుక్కి బారసాల ఫంక్షన్ చేసినట్టుగా కనిపిస్తోంది.

  • May 18, 2023, 12:30 PM IST
1 /5

యాంకర్ లాస్య ఎప్పటి నుంచో బుల్లితెరపై ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. యాంకరింగ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న లాస్య మధ్యలో గ్యాప్ ఇచ్చేసింది.

2 /5

చాలా ఏళ్ల తరువాత బిగ్ బాస్ షోకు వచ్చింది లాస్య. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో లాస్య బాగానే ఆకట్టుకుంది. కానీ వంటలక్క అనే బిరుదుకు పరిమితమైంది.

3 /5

లాస్య బిగ్ బాస్ ఇంట్లో ఉండగా.. ఆమె భర్త మంజునాథ్, కొడుకు జున్ను వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో భాగంగా లాస్య భర్త, పిల్లాడు వచ్చారు.

4 /5

రీసెంట్‌గానే లాస్య రెండో బిడ్డకు జన్మను ఇచ్చింది. మళ్లీ కొడుకు పుట్టాడంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తన కొడుకుని అందరికీ చూపించింది.

5 /5

లాస్య తన కొడుకు ఫంక్షన్‌లో ఇలా మెరిసిపోతోంది. మారాఠా సంప్రదాయంలో లాస్య కట్టూ బొట్టూ కనిపిస్తోంది. ప్రస్తుతం లాస్య ఫ్యామిలీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.