7 Lakhs Free Insurance: ఒక్క రూపాయి చెల్లించకుండానే 7 లక్షల ఉచిత ఇన్సూరెన్స్, ఎవరికి, ఎలా

7 Lakhs Free Insurance: ఈపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు ముఖ్య గమనిక. పీఎఫ్ ఖాతాదారులకు 7 లక్షల ఉచిత బీమా సదుపాయం ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

7 Lakhs Free Insurance: ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ ఎక్కౌంట్ తప్పకుండా ఉంటుంది. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎక్కౌంట్ హోల్డర్లకు 7 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని సైతం అందిస్తోంది. వాస్తవానికి ఈ విషయం చాలామంది ఎక్కౌంట్ హోల్డర్లకు తెలియదు. ఈ బీమా గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1 /6

ఉద్యోగం చేస్తుండగా మరణిస్తేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే రిటైర్ అయిన ఉద్యోగికి ఇది వర్తించదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు డెత్ సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్ అవసరమౌతాయి.

2 /6

ఈ పథకంలో కనీస ఇన్సూరెన్స్ క్లెయిమ్ 2.5 లక్షలు కాగా గరిష్టంగా 7 లక్షలుంటుంది. ఉద్యోగి కనీసం 12 నెలలుగా ఉద్యోగం చేస్తుండాలి. ఉద్యోగం మానేస్తే ప్రయోజనం అందదు.

3 /6

ఉదాహరణకు ఉద్యోగి సరాసరి జీతం, డీఏ గత 12 నెలలు 15 వేలుంటే క్లెయిమ్ చేసే మొత్తం 5,25,000 ఉంటుంది. బోనస్ కింద 1,75,000 ఉంటుంది. అంటే మొత్తం 7 లక్షల రూపాయలుంటుంది. 

4 /6

ఇదొక ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పధకం. సహజ మరణం, ప్రమాదం, అనారోగ్యం ఇందులో కవర్ అవుతాయి. లీగర్ వారసులు క్లెయిమ్ అందుకోవచ్చు. మీ కనీస వేతనం, డీఏకు 35 రెట్లు ఇన్సూురెన్స్ ఉంటుంది. ఇది కాకుండా బోనస్ కింద 1,75 వేల రూపాయలు అందుతాయి.

5 /6

మీరు ఉద్యోగి అయుండి జీతం నుంచి పీఎఫ్ కట్ అవుతుంటే మీకు 7 లక్షల బీమా ఉన్నట్టే. దీనికోసం ప్రీమియంగా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ ఇన్సూరెన్స్ కల్పిస్తుంది.

6 /6

ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ ఓపెన్ అయినప్పుుడే ప్రతి ఖాతాదారునికి 7 లక్షల ఉచిత బీమా సౌకర్యం ఏర్పాటవుతుంది. ఇందులో ఎక్కౌంట్ హోల్డర్ అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం వర్తిస్తాయి. ఆ ఉద్యోగి లీగల్ వారసులకు 7 లక్షల రూపాయలు అందుతాయి.  ఈ స్కీమ్ అందుకోవాలంటే షరతులేంటి, క్లైయిమ్ నగదు ఎలా లెక్కిస్తారనేది తెలుసుకుందాం.