Sridevi: మహిళలకి ఆకర్షితుడయ్యా.. అంటూ శ్రీదేవి భర్త బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు..!

Boney Kapoor interview: శ్రీదేవితో వివాహానికి ముందే.. ప్రముఖ నిర్మాత బోనికపూర్ కి మోనా అనే ఆమెతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.  కాగా మోనా తో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తరువాత.. ఆమెకు శ్రీదేవి కోసం విడాకులు ఇచ్చారు. ఇక ఇప్పుడు.. ఇతర ఆడవాళ్ల పట్ల వ్యామోహం కలిగిన.. ఆమె పైన ప్రేమ చావదని.. శ్రీదేవి గురించి చెబుతూ బోనీకపూర్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశీర్వదిస్తున్నాయి తెలిపారు.  

1 /5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, శ్రీదేవి సుమారుగా ఏడేళ్ల పాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు జాన్వీ కపూర్ , మరొకరు ఖుషీ కపూర్.. కానీ బోనీకపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకునే సమయానికే బోనీకపూర్ కు వివాహమై.. పిల్లలు ఉండడంతో మొదట శ్రీదేవి బోనీ కపూర్ ప్రేమకి నో చెప్పింది అని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి.  

2 /5

అంతేకాదు కొన్నేళ్లపాటు బోనీ కపూర్ కి కూడా దూరంగా ఉంది శ్రీదేవి. కానీ చివరికి శ్రీదేవిపై.. తనకున్న ప్రేమను.. బోనీ కపూర్.. వివరించేసరికి ఆమె కూడా కాదన లేకపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ముఖ్యంగా శ్రీదేవి తనను ప్రేమించేలా.. బోనీకపూర్ ప్రేరేపించారని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.    

3 /5

అయితే శ్రీదేవి తో పెళ్లికాకముందు మొదట.. 1983లో బోనీకపూర్ మోనా ను వివాహం చేసుకున్నారు. వీరికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ అనే పిల్లలు కూడా ఉన్నారు. ఇక 1996లో శ్రీదేవిని వివాహం చేసుకున్నారు బోనీకపూర్. ఈ కారణంగానే తన మొదటి భార్య మోనాకు.. విడాకులు ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీకపూర్ తన భార్య శ్రీదేవిని ఎప్పుడూ కూడా మోసం చేయలేదని, ఆమె అంటే తనకు చాలా ఇష్టమని, శ్రీదేవి దేవత అత్యంత ఆకర్షణీయమైన అందగత్తె కాదు.. గొప్ప వ్యక్తిత్వం ఉన్న భార్య అంటూ తెలియజేశారు.    

4 /5

 ఏడేళ్ల పాటు తనను ప్రేమించే తర్వాత పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే తాను ఇతర మహిళల విషయంలో కూడా కొన్నిసార్లు ఆకర్షితుడు అయినా కానీ.. శ్రీదేవి పైన తనకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ చావదంటూ తెలియజేశారు బోనీకపూర్. 

5 /5

ఇక ప్రస్తుతం శ్రీదేవి లేకపోయినప్పటికీ కూడా తన ప్రేమ.. ఆమె పైన బలంగానే ఉందని. తాను ఇతర మహిళలకు ఆకర్షితుడైనా శ్రీదేవి పైన ఉన్న తన ప్రేమ ముందు ఏది నిలవలేదని వెల్లడించారు.. బోనీకపూర్. తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళ పట్ల తాను కొన్నిసార్లు ఆకర్షితుడు అవుతానని కానీ.. తన భార్య శ్రీదేవికి సంబంధించి.. ప్రేమ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు అంటూ తెలిపారు.