Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినప్పుడు కరీనాకపూర్ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండిందో తెలుసా..?

Kareen Kapoor: సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినప్పుడు కరీనా తన స్నేహితులతో కలిసి ఫన్ నైట్‌లో ఉన్నారు. ఈ ఘటన తరువాత సెలబ్రిటీల భద్రతపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.  ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /5

ముంబై నగరంలో జనవరి 16, 2025 ఉదయం, బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ దారుణ దాడికి గురైన సంగతి తెలిసిందే. తన ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించే దుండగుడిని అడ్డుకునే క్రమంలో సైఫ్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడి బాలీవుడ్ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.  

2 /5

ఈ ఘటన అతని నివాసంలో జరిగినది. సైఫ్ తన పిల్లలు తైమూర్, జెహ్‌లతో ఇంట్లో ఉన్న సమయంలో, ఉదయం 2:30 గంటల సమయంలో, దొంగతనానికి వచ్చిన దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దుండగుడు ఆయన్ని పలుమార్లు కత్తితో గాయపరిచాడు. వెంటనే సైఫ్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు.  

3 /5

సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినప్పుడు, కరీనా కపూర్ తన స్నేహితులతో కలిసి ఫన్ నైట్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కరీనా తన అక్క కరిష్మా కపూర్‌తో కలిసి ఉన్నప్పుడు, ఈ విషయం తెలిసి వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు.  ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భర్త పై దాడి జరిగినప్పుడు కరీనా ఎక్కడ ఉంది అంటూ.. ఉదయం నుంచి ఎంతోమంది ప్రశ్నించసాగారు. ఇక ఈ విషయం తెలిసాక వారి ప్రశ్నలకు సమాధానం దొరికింది.  

4 /5

కాగా ఈ దాడి బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై పెద్ద ఎత్తున చర్చలను ప్రేరేపించింది. ప్రముఖుల నివాసాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఇటువంటి ఘటనలు జరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  

5 /5

ముంబై పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ దొంగతనానికి ముందే ప్రణాళిక ఉన్నదా లేదా అనే దానిపై వారు పరిశీలిస్తున్నారు. సైఫ్ ఆరోగ్యం గురించి తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.  ఈ ఘటనపై సెలబ్రిటీలు, ప్రేక్షకులు స్పందిస్తూ భద్రతా ప్రమాణాలను పునరాలోచించాలని కోరుతున్నారు.