Tirumala Devotees: తిరుమలలో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ భక్తులకు భారీ షాక్ ఇచ్చింది. ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించడం లేదని ప్రకటించింది. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Tirumala: తిరుమల కొండపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Tirumala: దసరా సందర్భంగా ఉత్సవాలతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.
Tirumala: అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి.
Tirumala: ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అత్యధికంగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ద్విచక్రవాహనాలపై టీటీడీ ఆంక్షలు విధించింది.
Tirumala: గరుడ సేవ కారణంగా అధిక భక్తుల రద్దీ ఉండడంతో ఈనెల 9వ తేది ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల ప్రవేశం నిషిద్ధమని టీటీడీ అధికారులు ప్రకటించారు.
Tirumala: అలిపిరి పాత చెక్ పోస్ట్ దగ్గర టీటీడీ మైదానంలో ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో మాత్రమే ప్రయాణం చేయాలని టీటీడీ ద్విచక్ర వాహనదారులకు సూచించింది.
Tirumala: కొత్తగా ఈ ఏడాది టాక్సీలను కూడా గరుడ సేవ రోజున అనుమతి లేదని తెలపడం గమనార్హం. ట్యాక్సీలు, ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.