Tirumal Tirupati Devasthanam: ఇక 27 వ తేదీన తిరుమల, తిరుపతి శ్రీవారి సేవకోటా, నవనీత సేవ, పరకామణి సేవ టిక్కెట్లను విడుదల చేయనున్నారు. శ్రీవారికి సేవ చేయాలనుకునే భక్తులకు ఇది సువర్ణ అవకాశం.
Tirumal Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను నేడు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ నెల కోటాలో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
లక్కీ డిప్ విధానం ద్వారా అర్జిత సేవ టిక్కెట్లను మొన్న జూలై 20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించిన టీటీడీ నేడు రూ. 300 ప్రత్యేక దర్శనం కోటాను విడుదల చేయనుంది. స్వామి వారి కల్యాణోత్సవం, ఊంజాల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర్తదీపాలంకార టిక్కెట్లను జూలై 22 ఉదయం పది గంటల సమయంలో విడుదల చేసింది. వర్చువల్ స్వరీస్ కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విడుదల చేశారు.
ఇక నిన్న 23 టీటీడీ అంగప్రదక్షిణ టిక్కెట్లను ఉదయం 10 గంటలకు, శ్రీవారి ట్రస్ట్ టిక్కెట్లు 11 గంటలకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కోటానును మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. అయితే, నేడు బుధవారం జూలై 24 న రూ. 300 దర్శనం టిక్కెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే గదుల కోటాను కూడా మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచనుంది. ఇది అక్టోబర్లో తిరుమల వెళ్లాలనుకునే భక్తుల కోసం అందుబాటులో ఉంచనున్నారు.
ఇక 27 వ తేదీన తిరుమల, తిరుపతి శ్రీవారి సేవకోటా, నవనీత సేవ, పరకామణి సేవ టిక్కెట్లను విడుదల చేయనున్నారు. శ్రీవారికి సేవ చేయాలనుకునే భక్తులకు ఇది సువర్ణ అవకాశం.
భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల విడుదల చేస్తోంది. శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇలా టిక్కెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తోంది. అందుకే భక్తులకు సులభంగా ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ కూడా అందుబాటులో పెట్టింది. అక్టోబర్ మాసంలో ఎక్కువ మంది భక్తులు టీటీడీ ని సందర్శిస్తారు. వారి కోసం టీటీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కూడా చేస్తోంది.