Keerthy Suresh Pics: ఆ చూపులేంటి వెన్నెల.. కీర్తి సురేష్ స్టైలీష్ లుక్ పిక్స్ వైరల్

Keerthy Suresh Latest Photoshoot: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్.. నేను శైలజా మూవీతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుని.. వరుసగా తమిళ సినిమాలతో బిజీ అయింది. ఆ తరువాత మళ్లీ నేచురాల్ స్టార్ నాని సరసన నేను లోకల్ మరో బ్లాక్‌బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
 

1 /5

మహానటి మూవీ కీర్తి సురేష్ కెరీర్‌లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రలలో ఒకటిగా నిలిచింది. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరుకు జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి.  

2 /5

ఈ మూవీలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వరించింది. ఈ సినిమా హిట్‌తో తెలుగు, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కీర్తి సురేష్ పేరు మార్మోగిపోయింది.  

3 /5

మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపర్చినా.. సర్కారు వారి పాట మూవీతో మళ్లీ హిట్ అందుకుంది. ఇక ఈ ఏడాది దసరా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.  

4 /5

ఇందులో కీర్తి సురేష్‌ తెలంగాణ స్టెప్పులు ఇప్పట్లో అభిమానులు మరిచిపోలేరు. కొన్ని వేల మంది కీర్తి డ్యాన్స్‌కు రీల్స్ చేశారు  

5 /5

మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీలో కీర్తి యాక్ట్ చేస్తోంది. ఇందులో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్‌గా షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.