Heroine Daughters: 1990వ దశకంలో బాలీవుడ్ పరిశ్రమను ఏలిన నాటి అగ్ర నటీమణుల్లో ప్రేమ పావురాలు భాగ్యశ్రీ, రవీనా టాండన్, కరీనా కపూర్, కాజోల్, జూహీచావ్లాలు చెప్పుకోదగ్గవారు. నటనకు దూరంగా ఉన్న ఈ నటీమణుల ముద్దుల కుమార్తెలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో చూద్దాం..
రాషా టాండన్ రాషా టాండన్...రవీనా టాండన్ ముద్దుల కూతురు. 2004లో అనిల్ థడానీని పెళ్లి చేసుకున్న తరువాత రవీనాకు పుట్టిన కూతురు. 17 ఏళ్ల రాషా టాండన్ కూడా అందగెత్తెనే.
సమైరా కపూర్ కపూర్ కుటుంబం నుంచి వచ్చిన అగ్ర నటి కరీనా కపూర్ 90 దశకంలో బిజీ నటి. ఇప్పటికే అదే అందంతో ఉన్న కరీనా కపూర్ ముద్దుల కుమార్తె 17 ఏళ్ల సమైరా కపూర్ తరచూ వార్తల్లో ఉంటోంది.
నైసా దేవగణ్ 90వ దశకంలో మరో బిజీ నటి, స్టార్ నటి కాజోల్. అజయ్ దేవగణ్‌ను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైంది. ఇటీవల సోషల్ మీడియా, టీవీ షోల్లో తళుక్కుమంటోంది. కాజోల్ కుమార్తె 18 ఏళ్ల నైసా దేవగణ్ త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
జాహ్నవి మెహ్తా 1990 దశకంలో వెండితెరను ఏలిన జూహీ చావ్లాను ఎవరూ మర్చిపోలేరు. నాటి స్టార్ నటి జూహీ చావ్లాకు 20 ఏళ్ల కూతురు జాహ్నవి మెహ్తా వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును నిర్వహిస్తోంది.
అవంతిక దాసాని ప్రేమ పావురాలు లేదా మైనై ప్యార్ కియా సినిమాతో యువత హృదయాల్ని కొల్లగొట్టిన నాటి మేటి నటి భాగ్యశ్రీ. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా మైమరపించింది. ఆమె కుమార్తె అవంతిక దాసాని సోషల్ మీడియాలో యాక్టివ్. 26 ఏళ్ల అవంతిక అందం తల్లితో పోటీ పడుతోంది.