Best weight loss foods: బరువు తగ్గేందుకు బెస్ట్ ఫుడ్ ఐటమ్స్

Best foods to lose weight and foods after workouts: అధిక బరువు తగ్గడానికి శరీరంలో పొటాషియం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలోని న్యూట్రియెంట్స్‌ని కణాలకు అందించడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో పొటాషియందే కీలక పాత్ర.

Best foods to lose weight and foods after workouts: అధిక బరువు తగ్గడానికి శరీరంలో పొటాషియం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలోని న్యూట్రియెంట్స్‌ని కణాలకు అందించడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో పొటాషియందే కీలక పాత్ర. పోటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు తగ్గడం సులభతరం అవుతుంది. అలాంటి పొటాషియం రిచ్ ఫుడ్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1 /5

Kidney beans - కిడ్నీ బీన్స్ : కిడ్నీ బీన్స్‌లో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవే కాకుండా ఫోలేట్, ఐరన్, కాపర్, విటమిన్ కే, మాంగనీస్ లాంటి న్యూట్రియంట్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. వర్కౌట్స్ తర్వాత ఇవి తింటే బరువు తగ్గేందుకు (Health benefits of Kidney beans) బాగా ఉపయోగపడతాయి.  

2 /5

Bananas - అరటి పండ్లు : అరటి పండ్లలో పొటాషియం, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. సంవత్సరం పొడుగునా అందుబాటులో ఉండే ఈ పండ్లలో యాంటీఆక్సీడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. అరటి పండ్లు రెగ్యులర్‌గా తింటే జీర్ణశక్తి పెరగడంతో పాటు గుండెకు కూడా మేలు (Health benefits of Bananas) చేస్తాయట. మొత్తానికి బరువు తగ్గడంలో ఇవి కూడా ఉపకరిస్తాయని న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

3 /5

Coconut Water - కొబ్బరి నీళ్లు : బరువు తగ్గేందుకు వర్కౌట్స్ చేసే క్రమంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరి నీళ్లు తీసుకున్నట్టయితే.. అందులోని న్యూట్రియెంట్స్ శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసి శక్తిని అందిస్తాయి. అలాగే, మెగ్నీషియం, క్యాల్షియం, ఉప్పు, మాంగనీస్, పొటాషియం అధిక మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గేందుకు వర్కౌట్స్ (Workouts to lose weight) చేసేవారికి ఇది మంచి టానిక్ లాంటిది అని చెప్పొచ్చు.

4 /5

Sweet Potatoes - స్వీట్ పొటాటోస్: బరువు తగ్గాలని ప్రయత్నాలు చేసే వారికి స్వీట్ పొటాటో చక్కటి ఆహారం. శీతాకాలంలో అధికంగా లభించి స్వీట్ పొటాటోలో ప్రొటీన్, పోటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్-సి, విటమిన్ బి6, విటమిన్-ఏ లాంటి వాటికి స్వీట్ పొటాటో సూపర్ ఫుడ్. ఇందులో ఉండే న్యూట్రియంట్స్ బరువు తగ్గేందుకు (Weight loss) దోహదపడతాయి.

5 /5

Spinach - పాలకూర, బచ్చలి కూర: పాలకూర (Palakura), బచ్చలి కూర (Bachali kura) లాంటి ఆకుకూరల్లో ఉండే రిచ్ న్యూట్రియంట్స్ బరువు తగ్గేందుకు సాయపడతాయని న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.