Best Water proof Phones: కస్టమర్ల సౌకర్యం, ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ఫోన్ ఫీచర్లు మారుతున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రతి పని స్మార్ట్ఫోన్ ఆధారంగానే జరుగుతోంది. ఇటీవలి కాలంలో వాటర్ రెస్టిస్టెన్స్ ఫోన్ల రేటింగ్ ప్రత్యేకంగా మారింది. నీళ్లలో పడినా, తడిసినా ఆఖరికి నీళ్లలో ఫోటోలు కూడా తీయగలిగే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అలాంటి బెస్ట్ వాటర్ రెసిస్టెన్స్ 5 ఫోన్ల వివరాలు మీ కోసం..
OPPO F27 Pro Plus ఈ టాప్ 5 వాటర్ రెసిస్టెన్స్ ఫోన్లలో మొదటిది OPPO F27 Pro Plus. ఈ ఫోన్ ధర 27,999 రూపాయలు. ఈ ఫోన్ నీళ్లతో పూర్తిగా సురక్షితం. నీళ్లలో ఈ ఫోన్ తీసుకెళ్లవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ఐపీ 69 రేటింగ్ కలిగి ఉంది. 30 నిమిషాల వరకూ 30 మీటర్ల లోతు నీళ్లలో పనిచేస్తుంది.
Motorola Edge 50 ఇదొక అద్భుతమైన స్మార్ట్ఫోన్. పూర్తిగా నీళ్లలో మునిగి ఈ ఫోన్ వాడవచ్చు. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంది. ఇది వాటర్ కంపాటిబుల్ ఫోన్. ఈ ఫోన్ ధర 27,999 రూపాయలు. ఈ ఫోన్ కూడా నీళ్లలో పూర్తిగా సురక్షితం. ఇది పలుచగా, తేలికగా, గట్టిగా ఉంటుంది. అద్భుతమైన కెమేరా, స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకత
VIVO V40 Pro ఈ ఫోన్ ధర 49,999 రూపాయలు. అద్భుతమైన కెమేరా, ప్రోసెసర్ ఈ ఫోన్ సొంతం. వాటర్ ప్రూఫ్ ఫోన్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది.
Samsung Galaxy Z Fold6 ఈ ఫోన్ శాంసంగ్ కంపెనీకు చెందిన అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటి. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో వచ్చిన బెస్ట్ ఫోల్డ్ ఫోన్. ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది.
Apple iPhone 15 ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపిల్ ఫోన్లలో ఇదే లేటెస్ట్. ఈ ఫోన్ ధర ఇప్పుడు 65,499 రూపాయలు. పూర్తిగా 100 శాతం వాటర్ రెసిస్టెన్స్ కలిగింది. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్ కలిగి ఉంటుంది. 30 నిమిషాల వరకు 6 మీటర్ల లోతు నీళ్లలో వినియోగించవచ్చు.