Valley Of Flowers: ప్రకృతి ఒడిలో మైమరచిపోయే అందాలు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు

Best Tourist Places In India: మీరు ఎన్నో లోయలను చూసుంటారు గానీ.. ఎప్పుడైనా పూల లోయను చూశారా..? ఇప్పటికి వరకు చూడకపోతే ఒక్కసారైనా ఈ అద్భుత అందాలను చూసి మైమరచిపోవాల్సిందే. ఈ పూల లోయ అనేక రకాల పుష్ఫాలకు నిలయం. ఎక్కడ ఉందంటే..
 

  • Apr 01, 2023, 23:22 PM IST
1 /5

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో పూల లోయ ఉంది. ఇక్క 500 కంటే ఎక్కువ రకాల పుష్పాలను చూడవచ్చు. పూల లోయ 87.50 కిమీ చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉంది.  

2 /5

ఇది ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. దేశ విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు.   

3 /5

బ్రిటిష్ పర్వతారోహకుడు ఫ్రాంక్ స్మిత్ 1931లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌ని కనుగొన్నాడు. స్మిత్ ఈ లోయ గురించి "వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్" అనే పుస్తకాన్ని కూడా రాశారు.  

4 /5

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఈ పూల లోయను గుర్తించింది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి చెందింది.   

5 /5

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రతి సంవత్సరం జూన్ 1న ఓపెన్ అవుతుంది. అక్టోబర్‌ నెలలో క్లోజ్ చేస్తారు. ఈ లోయ నార్, గంధమాధన్ పర్వతాల మధ్య ఉంది. లోయకు సమీపంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది.