Low GI Foods: డయాబెటిస్ వ్యాధి గ్రస్థులు ఆహారం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆహారపు అలవాట్ల కారణంగానే మధుమేహం సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాడం అన్ని విధాలా ఉత్తమం. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి.
ఓట్స్ మధుమేహం వ్యాధిగ్రస్థులు బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్, బీటా గ్లూకోన్ ఉంటుంది. అంతేకాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ కావడంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.
క్యారట్ క్యారట్ అనేది ఏడాది మొత్తం లభిస్తుంది. ఇందులో పొటా,ియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. క్యారట్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
పప్పులు పప్పులు డైట్‌లో భాగంగా ఉండాలి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. దాంతోపాటు కాల్షియం, పొటాషియం, విటమిన్ బి9 పెద్దఎత్తున ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ 25-30 మధ్యలో ఉంటుంది.
రాజ్మా రాజ్మా రుచితో పాటు ఆరోగ్యపరంగా చాలా మంచిది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కావడంతో పాటు ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ల కారణంగా డయాబెటిస్ రోగులకు చాలా మంచిది.