Best Bowlers in IPL History: ఐపీఎల్ అంటే బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామం. అయితే ఎంతోమంది బ్యాట్స్‌మెన్ల జోరుకు కళ్లెం వేసి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు కొందరు బౌలర్లు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేయండి.
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 59 వికెట్లు తీయగా.. ఐపీఎల్ కెరీర్‌లో రెండుసార్లు ఐదు వికెట్లు తీశాడు. ఉత్తమ గణాంకాలు: 5/16.
జయదేవ్ ఉనద్కత్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 91 వికెట్లు పడగొట్టాడు. లీగ్ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ 5/25.
టీ20 అత్యుత్తమ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 168 వికెట్లు పడగొట్టి.. రెండు సార్లు ఐదు వికెట్లు తీశాడు. బెస్ట్ బౌలింగ్ 5/19.
ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా సూపర్‌గా బౌలింగ్ చేశాడు. 5/14 అత్యుత్తమ ఫిగర్‌తో ఒకసారి ఐదు వికెట్లు తీశాడు.
ఐపీఎల్‌లో ఆడిన అతికొద్ది మంది పాకిస్థాన్ బౌలర్లలో సొహైల్ తన్వీర్ ఒకడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన తన్వీర్ బౌలింగ్‌లలో దుమ్ములేపాడు. ఒకసారి ఐదు వికెట్లతోపాటు మొత్తం 22 వికెట్లు తీశాడు. బెస్ట్ బౌలింగ్ 6/14.